
యాదాద్రి: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ప్రధానాలయ ఉద్ఘాటనపర్వాలు ఆగమశాస్త్రరీతిలో వైభవంగా కొనసాగుతున్నాయి. బాలాలయంలో కవచమూర్తులను ఆరాధించిన ఆచార్యులు మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి అవధారయలు, శాంతిమంత్ర, వేదపఠన పారాయణం చేశారు. యాగశాలలో చతుస్థానార్చన, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించారు. స్వయంభువు కొలువుదీరిన ప్రధానాలయంలో శిలామయ దేవతామూర్తులను ప్రత్యేకరీతిలో ఆరాధించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఏకాశీతి (81) కలశాలను ఏర్పాటు చేసి వివిధ ఔషాధులు, పలు రకాల పండ్లరసాలు, దర్భలు, మామిడి తోరణాలతో అలంకరించి ఆయా దేవతల మూలమంత్రాలతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం శిల, లోహ మూర్తులను పవిత్రీకరించి మంత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు.
ఇవి కూడా చదవండి