నిఘా నీడలో యాదాద్రి క్షేత్రం

Published: Sun, 27 Mar 2022 20:24:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిఘా నీడలో యాదాద్రి క్షేత్రం

యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవానికి హాజరవుతున్న ప్రముఖుల భద్రతకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉద్ఘాటనలో పాల్గొంటుండంతో, భద్రతను కట్టుదిట్టం చేశారు. యాదాద్రి క్షేత్రానికి ఇప్పటికే పారామిలటరీ, ఏఆర్‌, స్పెషల్‌ పోలీసు, బృందాలతో పహారా కాస్తున్నారు. యాదాద్రి క్షేత్రం ప్రాంగణమంతా బాంబ్‌స్క్వాడ్‌ బృందం తనిఖీలు చేపట్టింది. విస్తరణ పనుల నేపథ్యంలో కల్వర్టులు, గుంతల వద్ద క్షుణ్ణంగా పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలను అందుబాటులో ఉంచారు. ప్రముఖులకు, భక్తులకు ట్రాఫిక్‌తోపాటు శాంతిభదత్రల సమస్య తలెత్తకుండా యాదాద్రి ఆలయం తరుఫున 88సీసీ కెమెరాలు, పోలీసుశాఖ ఆధ్వర్యంలో మరో 150సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.


కొండపైన ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసి, సీసీ కెమెరాలతో ద్వారా ఎప్పటికప్పుడు నిఘా పెంచుతున్నారు. మహాకుంభ సంప్రోక్షణకు దాదాపుగా మూడు వేల మంది పోలీసులతో పటిష్టత భద్రతను ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీసు కమిషనర్‌, అదనపు పోలీసు కమిషనర్‌, డిప్యూటీ కమిషనర్లు, అదనపు డిప్యూటీ కమిషనర్లు, ఏసీలు, పలు విభాగాలకు చెందిన ఇన్‌స్పెక్టర్లకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాఽధికారులు, అధికారులు పెద్దసంఖ్యలో విచ్చేస్తున్నందున ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా పార్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులంతా బస్సుల్లో యాదాద్రి క్షేత్రానికి వెళ్లేందుకు ఏర్పాటు చేశారు. పాతగోశాల ప్రాంతంలో వీఐపీల కోసం పార్కింగ్‌ వసతి ఏర్పాటు చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.