యాదాద్రిలో 21 నుంచి వారంపాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం

Published: Wed, 16 Mar 2022 11:37:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon

యాదాద్రి : యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 28న మిధునలగ్న సుముహూర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం ఆలయంలో శాంతి కల్యాణం జరగనుంది. ఈనెల 21-28 వరకు పాంచరాత్రాగమ పద్ధతిలో ఉద్ఘాటన పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ జరగనుంది. స్వప్తిపుణ్యాహవచన మంత్ర పఠనాలతో ప్రధానాలయ ఉద్ఘాటన నిర్వహించనున్నారు. 21 నుంచి వారంపాటు బాలాలయంలో పంచకుండాత్మక హోమం జరగనుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.