యాళి వాహనంపై కోదండరాముడు

ABN , First Publish Date - 2021-04-24T04:21:21+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెంలోని పెద్దూరులో కొలువైన సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు శుక్రవారం యాళి వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.

యాళి వాహనంపై  కోదండరాముడు
యాళి వాహన సేవలో కొలువుదీరిన శ్రీ కోదండరాముడు.

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్‌ 23: బుచ్చిరెడ్డిపాళెంలోని పెద్దూరులో కొలువైన సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు శుక్రవారం యాళి వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం తిరిచ్చి ఉత్సవంపై ఆలయంలో ఊరేగారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఏవీ. శ్రీనివాసులురెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణారెడ్డి ఉత్సవాలను పర్యవేక్షించారు.

 బ్రహ్మోత్సవాల్లో నేడు : శ్రీకోదండరాముడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారు హనుమంతు సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

Updated Date - 2021-04-24T04:21:21+05:30 IST