Yamaha: నెల్లూరులో నూతన బ్లూ స్క్వేర్‌ ప్రీమియం ఔట్‌లెట్‌ ప్రారంభించిన యమహా

ABN , First Publish Date - 2022-07-31T02:40:53+05:30 IST

ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో తన మార్కెట్‌ను మరింత విస్తరిస్తోంది. తాజాగా

Yamaha: నెల్లూరులో  నూతన బ్లూ స్క్వేర్‌ ప్రీమియం ఔట్‌లెట్‌ ప్రారంభించిన యమహా

నెల్లూరు:  ఇండియా యమహా మోటార్ (IYM) ప్రైవేట్ లిమిటెడ్ ఇండియాలో తన మార్కెట్‌ను మరింత విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తమ మొదటి  బ్లూ స్క్వేర్‌ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. పట్టణంలోని వేదాయపాలంలో ఉన్న ఈ షోరూమ్‌ను 7400 చదరపు అడుగు విస్తీర్ణంలో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా యమహా మోటర్‌ ఇండియా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్  ఐషిన్‌ చిహానా మాట్లాడుతూ.. ‘కాల్‌ ఆఫ్‌ ద బ్లూ’ బ్రాండ్‌ ప్రచారంలో భాగంగా నెల్లూరులో తమ మొదటి బ్లూ స్క్వేర్‌ షోరూమ్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.  ఇక్కడ విస్తృత శ్రేణి యమహా యాక్ససరీలు, అప్పెరల్స్‌ పరిశీలించడంతో పాటుగా వినూత్నమైన యాజమాన్య అనుభవాలను సైతం పొందవచ్చని పేర్కొన్నారు.


బ్లూ స్క్వేర్‌లో మాత్రమే విక్రయించే ఏరోక్స్‌ 155తో పాటు ఈ ప్రీమియం ఔట్‌లెట్‌లో ఇతర యమహా మోటార్‌సైకిల్స్‌, స్కూటర్స్‌, అసలైన యాక్ససరీలు, అప్పెరల్స్‌, విడిభాగాలు లభిస్తాయి. అంతేకాదు  బ్లూ స్ట్రీక్స్‌ రైడర్‌ కమ్యూనిటీలో భాగమయ్యే అవకాశం కూడా వినియోగదారులకు ఈ షోరూమ్‌ కల్పిస్తుంది. ఈ నూతన ఔట్‌లెట్‌ ప్రారంభంతో  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రీమియం బ్లూ స్క్వేర్‌ షోరూమ్స్‌ నిర్వహిస్తున్నట్లయింది. భారతదేశ వ్యాప్తంగా ప్రస్తుతం 74 ఔట్‌లెట్లను  యమహా నిర్వహిస్తుంది.

Updated Date - 2022-07-31T02:40:53+05:30 IST