సముద్రగర్భంలో ‘యానై’ పోస్టర్‌ ఆవిష్కరణ

Sep 19 2021 @ 00:43AM

ప్రముఖ నటుడు అరుణ్‌ విజయ్‌, మాస్‌ డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకుంటున్న ‘యానై’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అయితే, ఈ చిత్రం పోస్టరు ఆవిష్కరణను అరుణ్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ విభిన్నంగా నిర్వహించారు. శనివారం పుదుచ్చేరికి చెందిన అరుణ్‌ విజయ్‌ ఫ్యాన్స్‌ ‘యానై’ పోస్టరును సముద్రగర్భంలో ఆవిష్కరించారు. ఈ తరహాలో పోస్టరును ఆవిష్కరించడం ఇదే తొలిసారని కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా, సీనియర్‌ నటీనటులు సముద్రఖని, రాధిక, యోగిబాబు తదితరులు కూడా నటిస్తున్నారు.     

- ఆంధ్రజ్యోతి, చెన్నై

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.