సొమ్మొకడిది.. సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి: యనమల

ABN , First Publish Date - 2022-05-14T23:30:09+05:30 IST

సొమ్మొకడిది.. సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి: యనమల

సొమ్మొకడిది.. సోకొకడిదిలా ఉంది జగన్ వైఖరి: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. సొమ్మొకడిది.. సోకొకడిదిలా జగన్ వైఖరి ఉందని యనమల మండిపడ్డారు. ఓఎన్జీసీ పైపులైన్లతో నష్టపోయిన మత్య్సకారులకు పరిహారమిచ్చేది కేంద్రమని, సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు జగన్ వ్యవహారం ఉందని మాజీ మంత్రి యనమల ఆరోపించారు. మత్స్యకారులకు పరిహారాన్ని 6 నెలలుగా తొక్కిపెట్టారని, పరిహారం ఇవ్వకుండా తొక్కిపెట్టడం జగన్‌ మోసం చేయడమే అని యనమల తెలిపారు. మూడేళ్లలో మీరేం చేశారో చెప్పే దైర్యం లేదా? అని సీఎంను యనమల ప్రశ్నించారు.

Read more