
కాకినాడ: రాష్ట్రాన్ని ఖాళీ చేసి జగన్ ప్యాలస్‌లు నిర్మించుకుంటున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే ఉన్నవాడికేం నష్టం లేదన్నారు. ఖజానా ఖాళీ అయితే పేదవాడికే నష్టమన్నారు. డబ్బు లేకపోతే పేదలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందవని తెలిపారు. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెబుతోందన్నారు. జీతాలు ఇవ్వలేని వారు పేదలను ఎలా ఆదుకుంటారని రామకృష్ణుడు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి