చంద్రబాబుతో తిరుపతి మెట్లెక్కగలవా ?

ABN , First Publish Date - 2022-05-27T06:02:30+05:30 IST

చంద్రబాబుతో కాలినడకన తిరుపతి మెట్లు ఎక్కగలవా అంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు.

చంద్రబాబుతో తిరుపతి మెట్లెక్కగలవా ?
సమావేశంలో మాట్లాడుతున్న యరపతినేని, బ్రహ్మారెడ్డి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి యరపతినేని సవాల్‌

చంద్రబాబు వయస్సుపై విమర్శకు కౌంటర్‌

అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న పీఆర్కే

మాచర్ల, గురజాలలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం :  బ్రహ్మారెడ్డి 

మాచర్ల, మే 26: చంద్రబాబుతో కాలినడకన తిరుపతి మెట్లు ఎక్కగలవా అంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సవాల్‌ విసిరారు. మాజీ సీఎం చంద్రబాబు వయస్సును విమర్శించే అర్హత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి లేదని అన్నారు. మండలంలోని ఒప్పిచర్లలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరైన యరపతినేని, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ  పోలీసులను అడ్డంపెట్టుకొని ఎమ్మెల్యే పీఆర్కే అక్రమాలను ప్రోత్సహి స్తున్నారని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం అక్రమాలకు అడ్డాగా మారిందని, గ్రానైట్‌, గుట్కా, తెలంగాణ మద్యంను ప్రోత్సహిస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా పీఆర్కే పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసులు అధికారపార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందన్న విషయాన్ని పక్కరాష్ట్ర మంత్రులు ప్రస్తావి స్తుంటే వైసీపీ నేతలు సిగ్గు పడాలన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల మయంగా, అమరావతి రాజధానిని అంధకారమయంగా మార్చారని విమర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పెట్రోలు ధర రూ.5 అధికంగా ఉందన్నారు. తక్షణమే ఇందనధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో బీసీ మహిళకు మంత్రి పదవి ఇస్తే ఓర్వలేక ధర్నాలు, రాస్తా రోకోలు చేయించిన ఘనత ఎమ్మెల్యే పీఆర్కేది అంటూ విమర్శిం చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసు, రెవెన్యూ, ఎస్‌ఈబీ శాఖల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో రైతు పాసు పుస్తకం పొందాలంటే రూ. 15 వేలు ఖర్చవుతుందని, ఇదేనా పారదర్శక పాలన అంటూ ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరడం, రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని యరపతినేని ధీమా వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో కుర్రి శివారెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాతులూరి కుమార్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు, జిల్లా అధికార ప్రతినిధి గోళ్ల సురేష్‌యాదవ్‌, మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారా యణ, పంగులూరి అంజయ్య, పుల్లయ్య, చప్పిడి రాము, తండా మస్తాన్‌జాని, మిరియాల వెంకటేశ్వర్లు, ఆముదాలపల్లి కృష్ణ, తోట నరసింహారావు, కటికల బాలకృష్ణ, షేక్‌ జానీబాషా (చికెన్‌), సయ్యద్‌ బాజీ (రబ్బానీ), బండారు శివ, పంగులూరి హనుమయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-27T06:02:30+05:30 IST