యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

ABN , First Publish Date - 2020-10-06T09:55:03+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారు లు యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించారు. ప్రాజెక్టు ల్లో నీటి మట్టాలు, భూగర్భజల లభ్యత ఆధారంగా యాసం గిలో వేసే పంటల విస్తీర్ణంను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక

యాసంగి యాక్షన్‌  ప్లాన్‌ రెడీ

ఉమ్మడి నిజామాబద్‌ జిల్లా యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

ఈసారి 8,07,856 ఎకరాలలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా

వరిలో దొడ్డు రకాలనే ఎక్కువగా సాగు చేస్తారని ప్రభుత్వానికి నివేదించిన అధికారులు

ఆ మేరకు ఎరువులు, విత్తనాలు పంపించాలని అధికారుల ప్రతిపాదన


నిజామాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యవసాయశాఖ అధికారు లు యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించారు. ప్రాజెక్టు ల్లో నీటి మట్టాలు, భూగర్భజల లభ్యత ఆధారంగా యాసం గిలో వేసే పంటల విస్తీర్ణంను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఉమ్మడి జిల్లా రైతులు యాసంగిలో వేసే పంటలకు కావాల్సిన ఎరువులు, విత్తనాల కోసం ప్రభు త్వానికి నివేదించారు. యాసంగి సాగు ఈనెలలోనే మొద లవుతుండడంతో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లలో నిమ గ్నమయ్యారు.


8,07,856 ఎకరాలలో పంటల సాగు అంచనా

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ఈ సంవత్సరం యాసంగిలో 8 లక్షల 7 వేల 856 ఎకరాల విస్తీర్ణంలో పంట లు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ విస్తీర్ణంలో సగానికిపైగా వరి సాగవుతుందని నివేదికలో పొందుపరిచారు. వానాకాలంతో పోల్చితే ఈ యాసంగిలో దొడ్డురకం వరినే ఎక్కువ సాగు చేస్తారని భా విస్తున్నారు. సన్న రకాలు సాగుచేస్తే ఎండలు ఎక్కువగా ఉండడం, నీళ్లు ఎక్కువగా అవసరం కావడం వల్ల రైతులు తక్కువ సమయంలో వచ్చే దొడ్డురకం వరిని సాగు చేస్తార ని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పొందుపరిచారు. ఉమ్మ డి జిల్లా పరిధిలో ఈ యాసంగిలో వరి, మొక్కజొన్న, శనగ, కంది, ఎర్రజొన్న, జొన్న, సజ్జ, నువ్వులు, పొద్దుతిరుగుడు, జవార్‌, పెసర, మినుములు, గోధుమ, పొగాకు, వేరుశనగ, చెరుకు తదితర పంటలను వేస్తారని అధికారులు ప్రభుత్వా నికి నివేదించారు. ఈ పంటలకు కావాల్సిన విత్తనాలు, ఎరు వులు పంపించాలని కోరారు. సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


 నిజామాబాద్‌ జిల్లాలో 4,86,218 ఎకరాలలో..

ఈ యాసంగిలో నిజామాబాద్‌ జిల్లాలో 4 లక్షల 86 వే ల, 218 ఎకరాలలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో సాధారణ విస్తీర్ణం కంటే మించి పంటలు సాగవుతాయని యాక్షన్‌ ప్లాన్‌లో పొందు పరిచా రు. గత సంవత్సరం యాసంగిలో 4 లక్షల 53 వేల 534 ఎక రాలలో పంటలు సాగు కాగా.. ఈ సారి మరో 23 వేల ఎక రాల విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. భూగర్భజ లాలు ఆశించిన స్థాయిలో ఉండడం వల్ల రైతులు వరికి ఎక్కువగా మొగ్గు చూపుతారని అంచనా వేశారు. మొత్తం విస్తీర్ణంలో 3 లక్షల 13 వేల ఎకరాల వరకు వరి సాగవుతుం దని వ్యవసాయశాఖ తయారుచేసిన యాక్షన్‌ ప్లాన్‌లో పొం దుపరిచారు. వరితో పాటు మొక్కజొన్న, ఎర్రజొన్న పంట లు కూడా ఎక్కువగా వేస్తారని అంచనా వేశారు. ఈ పంట ల కోసం లక్షా 77 వేల 577 మెట్రిక్‌ టన్నుల ఎరువులు కా వాలని నిర్ణయించారు. వీటిలో యూరియానే లక్షా నాలుగు వేల మెట్రిక్‌ టన్నులకుపైగా కావాలని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు.

 

కామారెడ్డి జిల్లాలో 3,21,638 ఎకరాలలో..

కామారెడ్డి జిల్లాలో ఈ యాసంగిలో 3లక్షల 21 వేల 638 ఎకరాలలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధి కారులు అంచనా వేశారు. అత్యధికంగా లక్షా 85 వేల 985 ఎకరాలలో వరి సాగవుతుందని నివేదికలో పొందుపరిచా రు. జిల్లాలోని చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టుల కింద ఈ వరి సాగవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా శనగ 66 వేల 543 వేల ఎకరాలలో సాగవుతు ందని అంచనా వేశారు. జిల్లాలో నీటి వసతి లేని ప్రాంతా ల్లో శనగ సాగును ఎక్కువగా చేస్తున్నారు. నీళ్లు లేకుండా మంచు, చలి ఆధారంగానే ఈ పంట సాగవుతుండడంతో రైతుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొక్కజొ న్న 37 వేల ఎకరాలలో, మిగతా పంటలు జొన్న, పొద్దు తిరుగుడు, నువ్వులు, కూరగాయలు సాగవుతాయని అంచ నా వేశారు. జిల్లాలో నీటి వసతి తక్కువగా ఉండడం వల్ల బోర్ల కిందనే ఎక్కువగా పంటలను సాగుచేస్తారని యాక్షన్‌ ప్లాన్‌లో పొందుపరిచారు. జిల్లాలో సాగయ్యే పంటల కోసం లక్షా 431 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసా య శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఎరువులలో


సగానికిపైగా 50 వేల 600 మెట్రిక్‌ టన్నుల యూరియా 

అవసరం ఉందని పేర్కొన్నారు. వీటితో పాటు కాంప్లెక్సు, పొటాష్‌ ఇతర ఎరువులు అవసరమని కోరారు.


 ట్రాన్స్‌కో అధికారుల ముందస్తు ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లా పరిధిలో యాసంగి పంటలు మొదలవు తుండడంతో ట్రాన్స్‌కో అధికారులు కూడా సన్నద్ధమవుతు న్నారు. వానాకాలంతో పోల్చితే యాసంగిలో విద్యుత్‌ విని యోగం ఎక్కువగా ఉండనుండడంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమున్న చోట ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పా టు చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత కరెంట్‌ ఇస్తుండడంతో ముందస్తుగా సమీక్షిస్తున్నారు. లూజ్‌ లైన్లను సరిచేస్తున్నారు. లో ఓల్టేజ్‌ ఉండకుండా కరెంట్‌ సరఫరా అ య్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

 

రుణాల పంపిణీకి బ్యాంకర్ల కసరత్తు

యాసంగి మొదలవుతుండడంతో బ్యాంకుల అధికారులు కూడా రుణ పంపిణీకి సిద్ధమవుతున్నారు. రైతులకు అవస రమైన రుణాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకర్ల కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా  రుణాలను అందించేందుకు సమాయత్తమవుతున్నారు. వానాకాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలో లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ప్రస్తుతం యాసంగిలో ఇచ్చే విధ ంగా అధికారులు చర్యలు చేపట్టారు.


యాసంగి కోసం అన్ని ఏర్పాట్లు - గోవింద్‌, జేడీఏ, నిజామాబాద్‌

నిజామాబాద్‌ జిల్లాలో యాసంగి యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించాం. ప్రభుత్వానికి నివేదిక పంపించాం. వ్యవ సాయశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. విత్తనా లు, ఎరువుల సమస్యలు రాకుండా ముందుస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి వసతి మేరకు పంటలు వేయాలని సూ చిస్తున్నాం.

 

కరెంట్‌ వినియోగం పెరుగుతుంది- సుదర్శనం, ఎస్‌ఈ ట్రాన్స్‌కో

వానాకాలంతో పోల్చితే యాసంగిలో కరెంట్‌ వినియో గం పెరుగుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో బోర్లు ఎక్కువ గా ఉన్నాయి. నీటి వసతి ఉండడం వల్ల రైతులు ఎక్కువ గా పంటలు వేసే అవకాశం ఉండడంతో రైతులకు సమ స్యలు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం.   


రుణ పంపిణీకి ఏర్పాట్లు- జయ సంతోషి, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

యాసంగి సీజన్‌ ప్రారంభమవుతున్నందున రుణ పం పిణీకి ఏర్పాట్లను చేస్తున్నాం. ప్రతీ బ్యాంకుకు టార్గెట్‌ ఇ చ్చాం. లక్ష్యానికి అనుగుణంగా రైతులకు పంట రుణాల ను ఇవ్వాలని అధికారులను కోరాం.

Updated Date - 2020-10-06T09:55:03+05:30 IST