జోష్‌ నింపిన యశస్వి

ABN , First Publish Date - 2021-10-18T05:55:36+05:30 IST

జీ సరిగమప విజేత యశస్వి కొండేపూడి పాటలతో ఉర్రూతలూగించాడు. మెలోడీలతో మైమరిపించాడు. హుషారైన గీతాలతో కుర్రకారుతో స్టెప్పులేయించాడు.

జోష్‌ నింపిన యశస్వి

భానుగుడి (కాకినాడ), అక్టోబరు 17: జీ సరిగమప విజేత యశస్వి కొండేపూడి పాటలతో ఉర్రూతలూగించాడు. మెలోడీలతో మైమరిపించాడు. హుషారైన గీతాలతో కుర్రకారుతో స్టెప్పులేయించాడు.  కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఆదివారం యూకే కాన్సెప్ట్‌ ఆధ్వర్యంలో యశస్వి నిర్వహించిన సంగీత విభావరికి కాకినాడ వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సంగీతాన్ని ఆశ్వాదించారు.  కొవిడ్‌తో గత రెండేళ్లుగా ఎటువంటి ప్రదర్శనలు లేకపోవడం కారణంగా ఈ కార్యక్రమం ప్రేక్షకుల్లో జోష్‌ నింపింది.  బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్‌ హరియానా గ్రోరీ యాంకరింగ్‌తో ఆకట్టుకుంది. కార్యక్రమంలో హైదరాబాద్‌ సంగీత కళాశాలకు చెందిన కళాకారులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:55:36+05:30 IST