Advertisement

‘గజకేసరి’గా వస్తోన్న కె.జి.యఫ్‌ స్టార్‌

Feb 26 2021 @ 16:47PM

కె.జి.యఫ్‌ చిత్రంతో కన్నడ స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన హీరో యశ్‌. ఆ చిత్ర విజయం అన్ని ఇండస్ట్రీలను ఔరా అనిపించింది. తెలుగులో కూడా ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుని సీక్వెల్‌ కోసం వెయిట్‌ చేసేలా చేసింది. ఇక తెలుగులో పాపులారిటీ తెచ్చుకున్న పరభాషా హీరోలకు సంబంధించిన పాత సినిమాలను అనువాదం చేయటమనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. కన్నడ సూపర్ స్టార్ యశ్ 'కె.జి.ఎఫ్'తో తెలుగునాట కూడా సూపర్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కె.జి.యఫ్‌ చిత్రంతో అంత క్రేజ్‌ వచ్చినప్పటికీ.. కన్నడలో యశ్ నటించిన సినిమాలపై ఇప్పటి వరకు ఏ నిర్మాతలు దృష్టి పెట్టలేదు. ఇప్పుడిప్పుడే ఆయన నటించిన పాత చిత్రాలపై దృష్టి పెట్టి తెలుగులోకి అనువదించేందుకు రెడీ అవుతున్నారు. 

 

ఈ లెక్కన మొట్ట మొదటగా తెలుగులో అనువాదం అవుతున్న చిత్రం.. 2014లో యశ్ నటించిన కన్నడ హిట్ చిత్రం 'గజకేసరి'.. అదే పేరుతో ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. శ్రీ వేదాక్షర మూవీస్, కలర్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామారావు చింతపల్లి, ఎం.ఎస్. రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. యస్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 5న తెలుగువారిని పలకరించబోతుంది. ఈ ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో యశ్ రెండు పాత్రల్లో కనిపించటం విశేషం. అమూల్య, అనంత్ నాగ్, సాధుకోకిల, గిరిజా లోకేశ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం వి. హరికృష్ణ అందించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను కూడా విడుదల చేశారు.

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.