యశ్వంతపురం-చండీఘడ్‌ మధ్య ప్రత్యేక Train

ABN , First Publish Date - 2021-10-23T15:18:08+05:30 IST

యశ్వంతపురం-చండీఘడ్‌ మధ్య వారానికి రెండు రోజులు నడిచే సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నవంబరు 3 నుంచి సంచారం ప్రారంభించనుంది. ఈ మేరకు నైరుతి రైల్వే నగరంలో శుక్రవారం ఒక ప్రక

యశ్వంతపురం-చండీఘడ్‌ మధ్య  ప్రత్యేక Train

                       - నవంబరు 3 నుంచి ప్రారంభం


బెంగళూరు(Karnataka): యశ్వంతపురం-చండీఘడ్‌ మధ్య వారానికి రెండు రోజులు నడిచే సూపర్‌ ఫాస్ట్‌ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు నవంబరు 3 నుంచి సంచారం ప్రారంభించనుంది. ఈ మేరకు నైరుతి రైల్వే నగరంలో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు యశ్వంతపురంలో ప్రతి బుధ, శనివారాల్లో  మధ్యాహ్నం 1.55కు బయలుదేరే ఈ ప్రత్యేక రైలు తుమకూరు, అరసికెరె, దావణగెరె, హుబ్బళ్ళి, ధార్వాడ, బెళగావి, మీరజ్‌, పూనె, మన్‌మాడ్‌, భోపాల్‌, ఝాన్సీ, హజరత్‌ నిజాముద్దీన్‌, కొత్తఢిల్లీ, పానిపట్‌, అంబాలా మీదుగా మరుసటి రోజు మధ్యాహ్నం 3-50కు చండీఘడ్‌ చేసుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చండీఘడ్‌ నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 3-35 గంటలకు బయల్దేరే ఈ రైలు మరుసటి రోజు ఉదయం 6-05కు యశ్వంతపురం చేరుకోనుందని రైల్వే  ప్రకటన పేర్కొంది. ఈ రైలులో మొత్తం 24 బోగీలు ఉంటాయని ప్రయాణికులు ఈ అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. 

Updated Date - 2021-10-23T15:18:08+05:30 IST