జూలైన 2న రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ప్రచార సభ

ABN , First Publish Date - 2022-06-30T23:43:37+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి పఓాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ప్రచార సభ జూలై 2న నగరంలోని జలవిహార్ లో జరగనుంది.

జూలైన 2న రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ప్రచార సభ

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి పక్షాల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ప్రచార సభ జూలై 2న నగరంలోని జలవిహార్ లో జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీ మెంబర్ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా జులై 2న ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారని తెలిపారు.


బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్, మంత్రులు స్వాగతం పలుకుతారని చెప్పారు.దాదాపు 6వేల బైక్ లతో ర్యాలీ జలవిహార్ చేరుకుంటుందని తెలిపారు.సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత యశ్వంత్ సిన్హా మాట్లాడుతారు.యశ్వంత్ సిన్హా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు.జలవిహార్ లో సభ ముగిసిన తరువాత యశ్వంత్ సిన్హా గాంధీ భవన్, ఎంఐఎం కార్యక్రమాలకు వెళ్తారని చెప్పారు.సాయంత్రం హైదరాబాద్ నుండి బెంగళూర్ వెళతారన్నారు.సభ ఏర్పాట్లను మంత్రి తలసాని స్వయంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. 


ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు స్వాగతం పలికిన విధంగా యశ్వంత్ సిన్హాకి కూడా ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అహంకారపూరితంగా, నియంతృత్వంగా దేశాన్ని పాలిస్తోందన్నారు.ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. న్యాయ కోవిదులు, భారత విదేశాంగ విధానం తెలిసిన యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు.


Updated Date - 2022-06-30T23:43:37+05:30 IST