Yati Narsinghanand సహా హిందూ మహాపంచాయత్ సభ వక్తలపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2022-04-04T14:33:54+05:30 IST

ఢిల్లీలో జరిగిన హిందూ మహా పంచాయత్ సభలో హిందువులు ఆయుధాలు పట్టండి అంటూ పిలుపు ఇచ్చిన దస్నాదేవీ ఆలయ ప్రధాన పూజారి యతి నర్సింగానంద్‌ తోపాటు ఇతర వక్తలపై ఢిల్లీ పోలీసులు...

Yati Narsinghanand సహా హిందూ మహాపంచాయత్ సభ వక్తలపై పోలీసు కేసు

న్యూఢిల్లీ : ఢిల్లీలో జరిగిన హిందూ మహా పంచాయత్ సభలో హిందువులు ఆయుధాలు పట్టండి అంటూ పిలుపు ఇచ్చిన దస్నాదేవీ ఆలయ ప్రధాన పూజారి యతి నర్సింగానంద్‌ తోపాటు ఇతర వక్తలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘‘దస్నాదేవి ఆలయ పూజారి యతి నర్సింహానంద సరస్వతి, సుదర్శన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ సురేష్ చవాన్కేతో సహా కొంతమంది వక్తలు రెండు వర్గాల మధ్య అశాంతి, శత్రుత్వ భావాలు, ద్వేషం పెంచేలా వ్యాఖ్యలు చేశారు’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఉషా రంగాని చెప్పారు.వాయువ్య ఢిల్లీలో హిందూ మహాపంచాయత్ సభ నిర్వహణకు అనుమతి కోరుతూ ఆర్గనైజర్ ప్రీత్ సింగ్, సేవ్ ఇండియా ఫౌండేషన్ ప్రెసిడెంట్ ల నుంచి అభ్యర్థన లేఖ అందిందని అయితే, బురారీ మైదానంలో ఈ సభను నిర్వహించేందుకు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి నిర్వాహకులకు ఎలాంటి అనుమతి లేదన్న కారణంతో ఆ అభ్యర్థన తిరస్కరించామని పోలీసులు చెప్పారు. 




సభ నిర్వహణ అభ్యర్థన తిరస్కరించినప్పటికీ నిర్వాహకుడు ప్రీత్ సింగ్ ఆదివారం ఉదయం తన మద్దతుదారులతో బురారీ మైదానానికి చేరుకుని హిందూ మహాపంచాయత్ సభను నిర్వహించారని ఢిల్లీ పోలీసులు చెప్పారు.ఈ సభలో యతి నర్సింహానంద్ సరస్వతి వేదికపై నుంచి ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేశారు. హిందువులు తమ ఉనికి కోసం పోరాడటానికి ఆయుధాలు పట్టుకోవాలని ఉద్బోధించారు.ముస్లింలకు సమాన హక్కులు ఇవ్వడానికి తాను వ్యతిరేకమని చవాన్కే అన్నారు.ఐపీసీ 188 సెక్షన్, 153ఎ చట్టాల కింద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వక్తలపై కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.కార్యక్రమంలో తమపై దాడి చేశారంటూ జర్నలిస్టుల ఫిర్యాదుపై కూడా వేర్వేరుగా ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు.


Updated Date - 2022-04-04T14:33:54+05:30 IST