Dharam Sansad విద్వేష పూరిత ప్రసంగం కేసులో నిందితుడు యతి నర్సింహానంద్‌కు బెయిల్

ABN , First Publish Date - 2022-02-16T16:42:52+05:30 IST

ధరమ్ సంసద్ విద్వేష పూరిత ప్రసంగం కేసులో నిందితుడు అయిన యతి నర్సింహానంద్‌కు బెయిల్ లభించింది...

Dharam Sansad విద్వేష పూరిత ప్రసంగం కేసులో నిందితుడు యతి నర్సింహానంద్‌కు బెయిల్

హరిద్వార్ : ధరమ్ సంసద్ విద్వేష పూరిత ప్రసంగం కేసులో నిందితుడు అయిన యతి నర్సింహానంద్‌కు బెయిల్ లభించింది. హరిద్వార్‌లో విద్వేషపూరిత ప్రసంగం కేసులో నిందితుడైన నర్సింహానంద్‌‌ను జనవరి 15న ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన యతి నర్సింహానంద్ బెయిల్‌పై బుధవారం జైలు నుంచి విడుదల కానున్నారు. ‘‘ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడేందుకు హిందూ బ్రిగేడ్‌కు ఆయుధాలు అందించాలి’’ అని ధర్మ సంసద్ కార్యక్రమంలో యతి నర్సింహానంద్  చెప్పారు.ఘజియాబాద్‌లోని దాస్నా ఆలయంలో పూజారి అయిన యతి నర్సింహానంద్ హరిద్వార్‌లో మూడు రోజుల ధరమ్ సంసద్ నిర్వాహకులలో ఒకరు.


గత ఏడాది డిసెంబరులో హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ లో పలువురు హిందూ పూజారులు ఇస్లాంకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఈ కార్యక్రమం అనంతరం మైనారిటీ వర్గాలపై హింసను ప్రేరేపించేలా ప్రసంగాల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.ద్వేషపూరిత ప్రసంగాల కేసులో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లలో యతి నర్సింహానంద్‌తో సహా పది మందికి పైగా పేర్లు ఉన్నాయి.


Updated Date - 2022-02-16T16:42:52+05:30 IST