అమరావతి: మద్యం, ఇసుక మాఫియాతో వైసీపీ వేల కోట్లు దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దొంగే దొంగ దొంగ అన్నట్లుగా జగన్ తీరు ఉందని మండిపడ్డారు. హైకోర్టుతో ఇన్నిసార్లు చివాట్లు తిన్న ఏకైక ప్రభుత్వం జగన్‌దేనన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉందని చెప్పారు. ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పలేక వైసీపీ నేతలు పారిపోతున్నారని బోండా ఉమ ఎద్దేవాచేశారు.