
అమరావతి: వైసీపీ అరాచకాలకు అడ్డే లేకుండాపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కూల్చడం తప్ప కట్టడం రాని వైసీపీ పాలనలో శిథిలాలే మిగులుతున్నాయని తెలిపారు. మాజీ ఎంపీ ఎర్రనాయుడు చిల్డ్రన్ పార్క్లో కూల్చివేతలు దారుణమన్నారు. బాధ్యులపై తీసుకున్న చర్యలు ఏంటి? అని ట్విటర్లో చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవుతుంటే.. డిప్యూటీ సీఎంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ బరితెగింపును అడ్డుకోలేని అధికారులకు ప్రజలు సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలకు ఓట్లేసింది ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల కోసం కాదని చంద్రబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి