దారుణంగా పడిపోయిన Jagan గ్రాఫ్.. సర్వేలో సంచలన నిజాలు

ABN , First Publish Date - 2022-07-14T01:08:31+05:30 IST

ఏపీ(Ap)లో వైసీపీ అధినేత జగన్ (Ycp Chief Jagan) గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది. ప్రామాణిక సర్వేల్లో ఆయన చివరి స్థానంలో ఉన్నారు. 25 రాష్ట్రాల్లో..

దారుణంగా పడిపోయిన Jagan గ్రాఫ్.. సర్వేలో సంచలన నిజాలు

అమరావతి (Amaravathi): ఏపీ(Ap)లో వైసీపీ అధినేత జగన్ (Ycp Chief Jagan) గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది. ప్రామాణిక సర్వేల్లో ఆయన చివరి స్థానంలో ఉన్నారు. 25 రాష్ట్రాల్లో 20 స్థానంలో జగన్ ఉన్నారు. తమ అధినేత జగన్ ‘మాట తప్పని.. మడమ తిప్పని గొప్ప నాయకుడని, అత్యాంత జనాదరణ ఉన్న సీఎం’ అంటూ వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటాయి. కానీ ప్రామాణిక సర్వేల్లో ఆయన చివరి వరుసలో నిలుస్తున్నారు. సెంటర్ ఫర్ నేషనల్ ఓపీనియన్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ సంస్థ తాజాగా దేశంలోని ముఖ్యమంత్రుల స్టామినాపై వివరాలను ప్రకటించింది. 


25 మంది సీఎంల ప్రజాదరణపై సర్వే

ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రజాదరణపై సర్వే చేసింది. నేతలకు ప్రజల మద్దతు ఏ మేరకు ఉందనే అంశంపై ఇటీవల సీఎన్‌వోఎస్  బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. ఆ సర్వేలో జగన్ 20వ స్థానంలో నిలిచారు. మొత్తం 25 మంది సీఎంలలో ఆయన అడుగునుంచి 6వ స్థానంలో ఉన్నారు. ఏపీలో 39 శాతం మంది వైసీపీ అధ్యక్షుడి నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 32 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించకుండా తటస్థంగా ఉండిపోయారు. 


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు..

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Cm Kcr)కు 11వ స్థానం దక్కింది. గులాబీ బాస్ నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉండగా  19 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. 24 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ఇక దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ (Odisha Cm Naveen Patnaik) నిలిచారు. ఒడిషాలో 70 శాతం ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి సంతృప్తితో ఉండగా 19 శాతం మందే అసంతృప్తి వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-07-14T01:08:31+05:30 IST