YCP సర్కార్ది అరాచక పాలన: చినరాజప్ప

ABN , First Publish Date - 2022-07-04T21:46:41+05:30 IST

వైసీపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి చినరాజప్ప తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ది

YCP సర్కార్ది అరాచక పాలన: చినరాజప్ప

చిత్తూరు: వైసీపీ ప్రభుత్వ విధానాలను మాజీ మంత్రి చినరాజప్ప తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సర్కార్ది అరాచక పాలన అని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ ద్వారా అరాచక పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని గంజాయి కేసులతో వేధిస్తున్నారని తప్పుబట్టారు. తప్పుడు కేసులు అడ్డుకున్నందుకు మాజీ మేయర్ హేమలతపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని చినరాజప్ప తెలిపారు.

Updated Date - 2022-07-04T21:46:41+05:30 IST