పోలింగునూ వదలని రంగు..

ABN , First Publish Date - 2021-03-06T06:37:11+05:30 IST

విజయవాడ 43వ డివిజన్‌లోని హెచ్‌బీ కాలనీలోని వార్డు సచివాలయం, పోలీ్‌సకాలనీలోని రెండు సచివాలయాలను మునిసిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాలుగా కేటాయిం చారు.

పోలింగునూ వదలని రంగు..

విజయవాడ 43వ డివిజన్‌లోని హెచ్‌బీ కాలనీలోని వార్డు సచివాలయం, పోలీ్‌సకాలనీలోని రెండు సచివాలయాలను మునిసిపల్‌ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాలుగా కేటాయిం చారు. అయితే, ఈ సచివాలయాలకు వేసిన వైసీపీ రంగులు ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. రంగులపై కోర్టు ఆదేశాల మేరకు ఆ మధ్య వాటిపై కనిపించే సీఎం ఫొటోలపై కాగితాలు అంటించారు. రంగుల తొలగింపు మాత్రం మరిచారు. పార్టీ గుర్తుపై జరిగే ఎన్ని కలివి. ఒకేపార్టీ జెండా రంగులు పులిమేసిన భవనాల్లో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాల్లోకి ఇతర పార్టీల అభ్యర్థులు, ఓటర్లు అడుగు పెట్టడం ఇబ్బందే! ఇక్కడ మొత్తం 1,959 ఓట్లు ఉన్నాయి. ఈ రంగుల మాయాజాలం వల్ల ఫలితం వైసీపీ అభ్యర్థికే అనుకూలంగా ఉండొచ్చునని ఇతర పార్టీల అభ్యర్థులు కలవరపడుతున్నారు. - భవానీపురం

Updated Date - 2021-03-06T06:37:11+05:30 IST