జగ్గయ్యపేటలో వైసీపీ కౌన్సిలర్ తల్లి ఆత్మహత్యాయత్నం

Nov 20 2021 @ 18:10PM

కృష్ణా: జగ్గయ్యపేటలో ఓ మహిళ బావిలోకి దూకి  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. ఇటీవల జరిగిన జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన నూకల సాంబశివరావు తల్లి మంగతయారు ఈ దారుణానికి పాల్పడటం స్థానికంగా సంచలనం రేపింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.