28న వైసీపీ జిల్లా ప్లీనరీ

Published: Sun, 26 Jun 2022 00:41:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
28న వైసీపీ జిల్లా ప్లీనరీజిల్లా ప్లీనరీ కోసం ఎస్వీయూ స్టేడియాన్ని పరిశీలిస్తున్న చెవిరెడ్డి

తిరుపతి, జూన్‌25(ఆంధ్రజ్యోతి): వైసీపీ తిరుపతి జిల్లా ప్లీనరీ సమావేశం ఈనెల 28న నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు. శనివారం ఎస్వీయూ తారకరామ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ ఎస్వీయూ స్టేడియం వేదికగా 10వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్లీనరీ నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశం తరహాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని, పలువురు పార్టీ ప్రముఖులు, పెద్దలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈసందర్భంగా ఏర్పాట్లపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.