వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం

ABN , First Publish Date - 2022-05-22T06:03:03+05:30 IST

ఉపాధి పనులు చేస్తున్న తమపై వైసీపీ కార్యకర్తలు దుర్భాష లాడుతూ, దౌర్జన్యం చేశారంటూ ఉపాధి కూలీలు పెదవేగి పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు.

వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం
ఉపాధి కూలీలకు సర్ది చెబుతున్న ఎస్‌ఐ సత్యనారాయణ

ఉపాధి కూలీల ఫిర్యాదు.. పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన

పెదవేగి, మే 21  : ఉపాధి పనులు చేస్తున్న తమపై  వైసీపీ కార్యకర్తలు దుర్భాష లాడుతూ, దౌర్జన్యం చేశారంటూ ఉపాధి కూలీలు పెదవేగి పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు. గొల్లపల్లి వీరలక్ష్మి అనే ఆమె పెదవేగి మండలం లక్ష్మీపురంలో 2012వ ఏడాది నుంచి ఉపాధిహామీ పఽథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తోంది. 2019 ఎన్నికల అనంతరం ఆమెను ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా తొలగించారు. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించగా వీరలక్ష్మిని తిరిగి ఫీల్ట్‌ అసిస్టెంట్‌గా నియమించాలని పేర్కొంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఈ ఏడాది నుంచి ఆమె తిరిగి విధులు నిర్వహిస్తోంది. అయితే ఆమెను తొలగిస్తు న్నామని, ఆ పనిని వేరొకరు చూస్తారంటూ శుక్రవారం ఉపాధిపఽథకం పనులు జరిగే ప్రదేశానికి వచ్చిన కొంతమంది వైసీపీ నాయకులు హడావుడి చేశారు. శనివారం నుంచి నీవు రావద్దని ఆమెతో చెప్పారు. దీనిపై కూలీలు శుక్రవారం పెదవేగి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి ఏపీవోకు విన్నవించగా మేమేమీ వీర లక్ష్మిని తొలగించలేదుగా.. మీరెందుకు ఆందోళన చెందుతున్నారని చెప్పి పంపేశారు. దీంతో శనివారం యధావిధిగా మస్తర్‌ పనులు చూస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వీరలక్ష్మి దగ్గరకు అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త రంగారావు అనే వ్యక్తి వచ్చి మస్తర్‌ పుస్తకాన్ని బలవంతంగా తీసుకుంటుండగా ఉపాధికూలీలు అడ్డుపడ్డారు. దీంతో ఆ వ్యక్తి ఫోన్‌ చేయడంతో వీరంపాలేనికి చెందిన ఐదుగురు వ్యక్తులు వచ్చి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌తో పాటు అడ్డు వచ్చిన కూలీలపై దాడికి తెగ బడ్డారు. కూలీలు తిరగబడడంతో వైసీపీ కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై ఆగ్రహి ంచిన కూలీలు పెదవేగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని, తమపై దాడి చేసిన ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయాలని, అప్పటివరకు ఇక్కడనుంచి కదలబోమంటూ పోలీస్‌స్టేషన్‌ దగ్గర బైఠాయించారు. దాడిచేసిన వ్యక్తులపై చర్యలు తీసు కుం టామని పెదవేగి ఎస్‌ఐ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో కూలీలు వెనుదిరిగారు


Updated Date - 2022-05-22T06:03:03+05:30 IST