ఏకగ్రీవాలపై వైసీపీ కన్ను

ABN , First Publish Date - 2021-03-03T07:08:25+05:30 IST

తమ పార్టీలో ప్రధానం అనదగ్గ వార్డులను ఎ లాగైనా ఏకగ్రీవాలు చేసుకోవాలన్న ధోరణితో వైసీపీ నాయకులు సామ, దాన, భేదోపాయాలను ప్రయోగిస్తున్నారు.

ఏకగ్రీవాలపై వైసీపీ కన్ను

రెండురోజులుగా బెదిరింపుల పర్వం

తొలిరోజే గుంతకల్లులో  ఒక వార్డు వైసీపీ కైవశం


గుంతకల్లు, మార్చి 2: తమ పార్టీలో ప్రధానం అనదగ్గ వార్డులను ఎ లాగైనా ఏకగ్రీవాలు చేసుకోవాలన్న ధోరణితో వైసీపీ నాయకులు సామ, దాన, భేదోపాయాలను ప్రయోగిస్తున్నారు. పలువురు టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు, బుజ్జగింపులతో దారికి తెచ్చుకోవడానికి అన్ని రకాల యత్నాలకు పాల్పడుతున్నారు. రెండు రోజులుగా పట్టణంలోని కొన్ని వార్డులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులపై ఒత్తిళ్లను పెంచినట్లు స్పష్టమవుతోంది. వైసీపీ నాయకుల బెదిరింపుల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయ్యే వరకూ టీడీపీ అభ్యర్థులను సమీకరించి క్యాం పును నిర్వహించాలని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు భావించారు. ఇందుకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించగా, ఒత్తిళ్లు ఉన్న అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోమంటూ రూఢీగా చెప్పడం తో ఆ ఆలోచనను విరమించారు. పట్టణంలోని 10, 22, 24, 28, 35 వార్డులలో టీడీపీ అభ్యర్థులపై ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఒకటవ వార్డులో జనసేన అభ్యర్థిపై కూడా వైసీపీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఉన్న ట్లు తెలస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం పూర్తయితే ఎన్నికలకు పక్కా ప్రణాళికను ఏర్పరచుకోవచ్చన్న అభిప్రాయాన్ని అన్ని పార్టీ లు భావించాయి. అత్యంత ఉత్కంఠభరితంగా 3వ తేదీ కోసం ఎదురుచూశారు. అనుకున్నట్లుగానే నామినేషన్ల ఉపసంహరణ తొలిరోజే టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి గుజరీ మహమ్మద్‌ ఖాజా తన కుమార్తె మాజీ కౌన్సిలరు యాస్మినచే నామినేషనను ఉపసంహరింపజేశారు. పార్టీలో ప్ర ధానమైన పదవిలో ఉన్న గుజరీ మహమ్మద్‌ ఖాజా, అభ్యర్థి యాస్మినలు మంగళవారం ఉదయం నుంచే సెల్‌ఫోన్లను స్విచ ఆఫ్‌ చేశారు. దీంతో టీ డీపీ శ్రేణులు కలవరపడ్డాయి. వైసీపీ నుంచి ఒత్తిళ్లను అధిగమించేందుకు ఫోన్లను ఆఫ్‌ చేశారా, లేక నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి చే శారా? అన్నది తెలియక తర్జనభర్జన పడ్డారు. ఆర్థిక సమస్య ఉంటే సహకారం తీసుకోవాలని, అంతేతప్ప నామినేషనను ఉపసంహరించుకోవద్దని మాజీ జడ్పీ చైర్మన కేసీ నారాయణ కూడా ఖాజాకు సూచించారు. ఇవేవీ కాదని నిశ్శబ్దంగా నామినేషనను వితడ్రా చేసేయడంతో టీడీపీ వర్గాలు ని ర్వేదానికి గురయ్యాయి. 

             

  నామినేషన ఉపసంహరణకు కారణం ఏదైనా.. ప్రధాన పదవిలో ఉన్న నాయకుడి పరిస్థితే ఇలా ఉంటే నామినేషన్లు వేసి న సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జ రిగిన నష్టాన్ని అటుంచి బుధవారం మరిన్ని వితడ్రాయల్స్‌ జరక్కుండా చేసేపనిలో టీడీపీ నాయకులు పడ్డారు.


పైకం పుచ్చుకో.. వితడ్రా చేసుకో!

టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులకు వైసీపీ నేతల హుకుం 

కళ్యాణదుర్గం: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా స్థానిక టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు అధికమయ్యాయి. పైకం తీసుకుని వితడ్రా చేసుకుంటారా.. లేదా? అంటూ ఏకంగా హుకుం జారీ చేస్తున్నట్లు పట్టణంలో ప్రచారం సాగుతోంది. వారం రోజులుగా టీ డీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులతో వైసీపీలో ఉన్న ధనికులు భేరసారాలు చేస్తూ పలువురిని ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు ప్రధాన రాజకీయ పార్టీల్లో చర్చసాగుతోంది. బలహీన వర్గాలకు చెందిన కౌన్సిలర్‌ అభ్యర్థులను టార్గెట్‌ చే సి భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఒక్కో కౌన్సిలర్‌ అభ్యర్థి కి రూ.12 లక్షలు ఇస్తాం.. వితడ్రా చేసుకోవాలని తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నాయకుల ఆగడాలను పసిగట్టిన టీ డీపీ నేతలు 24 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులను సోమవారం రాత్రి రహస్య ప్రాంతానికి తరలించిన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నామినేషన ఉపసంహరణ ప్రక్రియ దృష్ట్యా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుం డా పార్టీ ప్రతిష్టను కాపాడేందుకు టీడీపీ పెద్దలు చొరవ తీసుకున్నట్లు తె లుస్తోంది. ఈక్రమంలో కౌన్సిలర్‌ అభ్యర్థులతో చర్చించి నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. నామినేషన ఉపసంహరణ గడువు పూర్తి అనంతరం అభ్యర్థులను నేరుగా ఆయా వార్డుల్లో ప్రచారం చేసుకునే వెసులుబాటు  కల్పిస్తున్నట్లు టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. కనీసం నాలుగు వార్డుల ను ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నించి విఫలమైన్నట్లు వైసీపీ వర్గీయుల్లో చర్చ వినిపిస్తోంది. 

Updated Date - 2021-03-03T07:08:25+05:30 IST