వైసీపీ వైఫల్యాలను ఎండగట్టాలి

Sep 22 2021 @ 00:22AM
మాట్లాడుతున్న ఉగ్ర నరసింహారెడ్డి

కార్యకర్తల సమావేశంలో డాక్టర్‌ ఉగ్ర 

టీడీపీ గ్రామ కమిటీ ఏర్పాట్లు ముమ్మరం 

కనిగిరి, సెప్టెంబరు 21: టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ప్రతిష్ట కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. సమర్థవంతమైన పాలన చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు తెలియజేయాలన్నారు. చంద్రబాబునాయుడు తిరిగి అధికారంలోకి వస్తే కనిగిరి ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేలా తాను కృషి చేస్తానన్నారు. నిమ్జ్‌, రైలుమార్గం, ట్రిపుల్‌ ఐటీ, తాగు, సాగు నీరు ప్రధాన అంశాలుగా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఎవరైతే కనిగిరి ప్రాంత అభివృద్ధికి పాటు పడుతారో అలాంటి నాయకుడికే ప్రజలు పట్టం కట్టాలన్నారు. వెలుగొండ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని ప్రతి ఒక్కరూ, కలిసి మెలసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీలో నూతన కమిటీ ఎంపికలో పదవులు పొందిన వ్యక్తులు అహర్నిశలు శ్రమించేలా తయారు కావాలన్నారు. పదవులు పొందిన వారిని మూడు నెలల పాటు గమనిస్తానని, పార్టీ అభివృద్ధికి, గెలుపునకు పాటుపడని వ్యక్తులను పక్కన పెట్టి ఆ పదవుల్లో చురుగ్గా వ్యవహరించే వారికి తిరిగి ప్రాధాన్యత ఇస్తానన్నారు. సీనియర్‌ నాయకులు బేరి పుల్లారెడ్డి సేవలు రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందేలా పదవి ఇప్పించేందుకు తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీనియర్‌ నాయకుల సలహాలు, సూచనలతో నూతనంగా పదవులు పొందిన వారు ముందుకు దూసుకు పోవాలన్నారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడిగా మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు యాదవ్‌ను, మండల తెలుగు యువత అధ్యక్షుడిగా కొండా క్రిష్ణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉగ్ర వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు ఫిరోజ్‌, దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని వెంకటరెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, బుడే సాహెబ్‌, మాజీ అంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు రోషన్‌ సందాని, గుదే రమణయ్య, పచ్చవ వెంకటేశ్వర్లు, బాలు ఓబులురెడ్డి, నారాపరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఏడుకొండలు యాదవ్‌, అట్లా మల్లికార్జునరెడ్డి, సైకం మాలకొండారెడ్డి, సలోమన్‌రాజు, పిచ్చాల శ్రీనివాసులరెడ్డితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 

పామూరు : టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి గ్రామ కమిటీలు వేయనున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు బొల్లా మాల్యాద్రిచౌదరిలు తెలిపారు. గ్రామ కమిటీలు వేసేందుకు బీఎంసీతో చర్చించేందుకు ఆయన నివాసంలో మంగళవారం అందుబాటులో ఉన్న ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ దుర్మార్గపు పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. పార్టీ కోసం కష్టించి పనిచేసే కార్యకర్తలకు గ్రామ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వచ్చే నెల 9 నుంచిటీడీపీ గ్రామ కమిటీలు వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకొని పార్టీకి పూర్వ వైభవం కోసం చిన్న చిన్న విభేదాలను విడనాడి సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. సమావేశంలో తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి కే.సుభాషిణి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వై.ఎస్‌.ప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్‌డీ.అమీర్‌బాబు, ఎంపీటీసీ బి.నరసింహారావు, దేవరపు.మాల్యాద్రి, ఏ.ప్రభాకర్‌ చౌదరి, షేక్‌ ఖాజారహంతుల్లా, ఎం.రమణయ్య, గుంటుపల్లి శ్రీనివాసులు, షేక్‌ గౌస్‌బాష, ఎన్‌.సాంబయ్య, కోదండరామిరెడ్డి, ఆర్‌ఆర్‌.రఫీ, ప్రసాద్‌, ఎం.రాహుల్‌ యాదవ్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.

శింగమనేనిపల్లె (వలేటివారిపాలెం) : మండలంలోని శింగమనేనిపల్లె గ్రామ అధ్యక్షుడిగా అత్తోట విజయసారధిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా నంబూరి అభిషేక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాదాల లక్ష్మినరసింహం సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహం మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గుర్రం లక్ష్మీనరసింహం, బత్తిన ప్రసాద్‌, గరికపాటి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.