కోడెలది.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-09-16T22:03:38+05:30 IST

అమరావతి: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ది.. ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యేనని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కోడెల ద్వితీయ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన కోడెల చిత్ర

కోడెలది.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..: చంద్రబాబు

అమరావతి: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ది.. ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యేనని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కోడెల ద్వితీయ వర్ధంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన కోడెల చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పల్నాటి పులిగా పేరొందిన వ్యక్తిపై.. నీచమైన ఆరోపణలు చేశారన్నారు. మనోనిబ్బరం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తెచ్చారని మండిపడ్డారు. చేపట్టిన పదవులన్నింటికీ.. కోడెల వన్నె తెచ్చారని కొనియాడారు. పరువు కోసం బతికిన కోడెల.. ఆ పరువు కోసమే ప్రాణాలు కోల్పోయారన్నారు.


కోటప్పకొండను ఆదర్శంగా అభివృద్ధి చేశారని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్మశానాల నిర్మాణానికి కోడెల చేసిన సేవలు అభినందనీయమని తెలిపారు. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో.. కోడెల తరహాలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పారు. నంద్యాలలో అబ్దుల్ సలాం ఘటనే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే 63శాతం నేరాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఆఫ్ఘనిస్తాన్ కంటే ఘోరంగా మృగాలు పెట్రేగిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తారు. మాచర్ల, సత్తెనపల్లి, తాడేపల్లి, నెల్లూరు ఘటనలే ఇందుకు ఉదాహరణ అని చంద్రబాబు గుర్తు చేశారు.

Updated Date - 2021-09-16T22:03:38+05:30 IST