వైసీపీ పాలన.. ప్రజల పాలిట శాపం

ABN , First Publish Date - 2022-05-18T05:12:20+05:30 IST

మూడేళ్ల వైసీపీ పాలన ప్రజల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.

వైసీపీ పాలన.. ప్రజల పాలిట శాపం
కరపత్రాలు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి

బాదుడే బాదుడులో మాజీ మంత్రి సోమిరెడ్డి

ముత్తుకూరు, మే17: మూడేళ్ల వైసీపీ పాలన ప్రజల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని పొట్టెంపాడులో మంగళవారం సాయంత్రం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ వరకు అన్ని ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు.  రైతులు అన్ని విధాలుగా నష్టపోయారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాల ఆదుకున్నామన్నారు. జగన్‌ అరాచక పాలనకు త్వరలోనే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నీలం మల్లికార్జునయాదవ్‌, తెలుగుయువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డి, నాయకులు ఏకొల్లు కోదండయ్య, విష్ణువర్థన్‌రావు, మాచిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, షేక్‌ ఆలిముత్తు, దండు శ్రీనివాసులు, నిరంజన్‌రెడ్డి, విజయులురెడ్డి, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. 

ప్రజాధనం దోపిడీపై ఎమ్మెల్యే మౌనం

మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

కొడవలూరు :  కోవూరు నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్‌ , మటి ్ట మాఫియాలు ప్రజాధనాన్ని దోచుకుంటుంటే  ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, అధికారుల మౌనంపై ప్రజలు ఆలోచించాలని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. అన్నారు. మండలంలోని కొడవలూరు గ్రామంలో మంగళవారం టీడీపీ మండల కమిటీ  ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ప్రజలు పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి అయి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ఽ, నిత్యావసర ధరలు తగ్గించి  ఆదుకుంటారని తెలిపారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. నియోజక వర్గంలో రైతుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి , నాయకులు చెక్కామదన్‌, గరికపాటి రాజేంద్రకుమార్‌ , పంది శ్రీనివాసులు , కోడూరు సుధాకర్‌ రెడ్డి , నక్క వెంకట రమణయ్య , సుధాకర్‌ తదితరులు పాల్గోన్నారు. 

వెంకటాచలం : మండలంలోని ఇస్కపాళెం గ్రామంలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యాన జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. వైసీపీ పాలనలో అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయని, రాక్షస పాలన తప్ప సంక్షేమమే కనిపించడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్‌, తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు, నాయకులు  నాగార్జున్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, మునుస్వామి, చెన్న కృష్ణయ్య, ఖాయ్యుమ్‌ ఖాన్‌, ఎం రాజేష్‌, సురేష్‌, యాకల రవి,  రమేష్‌  తదితరులు పాల్గొన్నారు.

పొదలకూరు : మండలంలోని వెంకటాపురం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమం  జరిగింది. టీడీపీ మండలాధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబు, నాయకులు పులిపాటి వెంకటరత్నంనాయుడు, కోడూరు భాస్కర్‌రెడ్డి తదితర నాయకులు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరిగిన ధరలు, గతంలో ఉన్న ధరలను ప్రజలకు వివరించారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. 





Updated Date - 2022-05-18T05:12:20+05:30 IST