గుంటూరు: జిల్లాలోని దాచేపల్లిలో టీడీపీ నేత కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ మున్సిపల్ చైర్మన్ భర్త దాడికి పాల్పడ్డాడు. పాత కక్ష్యల నేపథ్యంలో వివాదం చోటు చేసుకుంది. టీడీపీ నేత ఇంటిపై మున్సిపల్ ఛైర్మన్ భర్త , కుమారులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగులు ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమైంది. 7 నెలల నాగులు కూతురుపై పెట్రోల్ పోసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధిత కుటుంబం ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. నాగులు కుటుంబం తలుపులు వేసుకోవడంతో మూగ జీవాలపై కూడా ఇనుప రాడ్లతో దాడి చేశారు. టీడీపీ నేత ఇంటి వద్ద మున్సిపల్ ఛైర్మన్ ఛైర్మన్ వర్గీయులు రాత్రి వేళ భీభత్సం సృష్టించారు.
ఇవి కూడా చదవండి