వివాహితపై.. వైసీపీ నేత అత్యాచారయత్నం..

Sep 15 2021 @ 14:29PM

అనంతపురం: బాలికలు, మహిళలపై దాడులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతలు కూడా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని పరిగి మండల పరిధి మోదా గ్రామంలో వివాహితపై వైసీపీ నేత అత్యాచారయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ నుంచి మోదా గ్రామానికి ఇటీవల ఓ కుటుంబం వలస వచ్చింది.


బుధవారం కుటుంబ సభ్యులంతా పనికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా మహిళపై గ్రామానికి చెందిన వైసీపీ నేత కుమారుడు అరుణ్‌కుమార్.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో సదురు మహిళ గట్టిగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు.. తలుపులు బద్దలు కొట్టి మహిళను రక్షించారు. విషయం తెలియడంతో అరుణ్‌కుమార్.. పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి :

ఓటర్ స్లిప్పుల పంపిణీలో వలంటీర్లుఅంతులేకుండా పోతున్న వైసీపీ నేతల ఆగడాలు మహిళపై వైసీపీ నేత అరాచకంబాలికపై వృద్ధుడి అత్యాచారయత్నంమహిళలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కేటుగాడు అరెస్ట్ భార్యను ఇంటికి రప్పించేందుకు..కూతురి మెడకు ఉరితాడు వేసి..

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.