టీడీపీ జెండాలు కప్పి.. వైసీపీ నేత అంతిమ యాత్ర

Published: Wed, 06 Jul 2022 03:13:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
టీడీపీ జెండాలు కప్పి.. వైసీపీ నేత అంతిమ యాత్ర

వైసీపీలో చేరి తప్పు చేశానని కన్నీరు

దురదృష్టవశాత్తూ మరునాడే కన్నుమూత

చివరి కోర్కె అనడంతో నెరవేర్చిన టీడీపీ 


భీమునిపట్నం, జూలై 5: తాను చనిపోయిన తర్వాత టీడీపీ జెండా తన మృతదేహంపై కప్పి అంతిమయాత్ర నిర్వహించాలని ఓ వైసీపీ నాయకుడు కోర డం, దాన్ని టీడీపీ నాయకులు నెరవేర్చడం స్థానికంగా చర్చనీయాంశమైంది. విశాఖ జిల్లా భీమిలికి చెందిన అప్పికొండ అప్పలనాయుడు టీడీపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్నారు. మూడేళ్ల క్రితం వైసీపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయనను ఆదివారం నియోజకవర్గ టీడీ పీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు, గంటా నూకరాజు, పా ర్లమెంటరీ నియోజకవర్గ నేత డి.ఎ.ఎన్‌.రాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ‘వైసీపీలో చేరి పెద్ద తప్పు చేశాను. ఒకవేళ చనిపోతే నా మృతదేహంపై టీడీపీ జెండా కప్పి అంతిమయాత్ర జరిపించండి’ అంటూ అప్పలనాయుడు వాపోయారు. దురదృష్టవశాత్తూ ఆ మరునాడే(సోమవారం) అప్పలనాయుడు చనిపోయా రు. దీంతో కోరాడ రాజబాబు బృందం మృతదేహాన్ని సందర్శించి ఆయన కోరుకున్నట్టే మృతదేహంపై టీడీపీ జెండాలు కప్పి అంతిమ యాత్ర జరిపించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.