వైసీపీ కార్యకర్తపై పోలీసుల దాష్టికం

ABN , First Publish Date - 2022-08-08T05:54:41+05:30 IST

తనను మాచవరం పోలీసులు అకారణంగా కొట్టారని మండలంలోని తురక పాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ కార్యకర్త షేక్‌ చికెన్‌ సుభాని తెలిపాడు.

వైసీపీ కార్యకర్తపై పోలీసుల దాష్టికం
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సుభాని

ఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు కలసి కొట్టారని బాధితుడు ఆరోపణ

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న సుభాని

మాచవరం, ఆగస్టు 7: తనను మాచవరం పోలీసులు అకారణంగా కొట్టారని మండలంలోని తురక పాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ కార్యకర్త షేక్‌ చికెన్‌ సుభాని తెలిపాడు. ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు సుభాని విలేకర్లతో మాట్లా డుతూ శనివారం తాను తన వాటర్‌ ప్లాంట్‌లో కూర్చుని తాను ఫోన్‌లో మాట్లాడుతుండగా మాచవరం ఎస్‌ఐ, నలుగురు సిబ్బంది అక్కడకు వచ్చి చొక్కాపట్టుకొని బలవంతంగా జీప్‌లో ఎక్కించుకొని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారన్నాడు శనివారం స్థానిక ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు మాచవరం వీధుల్లో జాతీయ జెండాను ప్రదర్శనగా తీసుకు వెళుతున్న సందర్భంలో తాను వాటర్‌ప్లాంట్‌లో కుర్చీలో కూర్చొని ఫోన్‌లో మాట్లాడుకుంటున్నానని, ఆసమయంలో ఎస్‌ఐ సిబ్బందితో వాటర్‌ప్లాంట్‌ వద్దకు వచ్చి తన చొక్కాపట్టుకొని ఎన్ని సార్లు పిలిచినా పోలీసు స్టేషన్‌కు రావేమిటంటూ కొట్టుకుంటూ జీపులో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లాడని తెలిపారు. స్టేషన్‌కువెళ్లిన తరువాత బూటుకాళ్లతో, బెల్టుతో కొట్టి తనను గాయపరిచా రన్నారు. అనంతరం నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని తెలిపాడు. ఈసంఘటనపై సోమవారం ఎస్పీకి, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని సుభాని తెలిపాడు. ఈ విషయంపై ఎస్‌ఐ కోటయ్య వివరణ ఇస్తూ సుభానిపై గతంలో మోహనరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడని, అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లామే తప్ప కొట్టలేదని తెలిపారు. మోహనరావు ఫిర్యాదు మేరకు సుభానిపై  కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

  

Updated Date - 2022-08-08T05:54:41+05:30 IST