
శ్రీకాకుళం: వైసీపీ నేతలపై టీడీపీ నేత శిరీష విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు ప్రకృతి వనరులను కూడా వదలడం లేదని టీడీపీ నేత శిరీష ఆరోపించారు. మందస మండలం నల్లబొడ్లూరులో వైసీపీ నేతలు అక్రమ గ్రావెల్ త్రవ్వకాలు చేపట్టినట్లు ఆమె అన్నారు. 9 ఎకరాల కంకర కొండను మాఫియా మాయం చేసింది. గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని టీడీపీ నేత శిరీష పరిశీలించారు. టీడీపీ నేతల పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. గ్రావెల్ తరలింపు వెనక స్థానిక ఎంపీపీ హస్తం ఉందని గౌతు శిరీష ఆరోపించింది.
ఇవి కూడా చదవండి