వైసీపీది కోతల ప్రభుత్వం: బీసీ

ABN , First Publish Date - 2022-06-30T06:06:50+05:30 IST

సంక్షేమ పథకాల్లో కోతలు విధించడం ధరలు ఆకాశాన్నంటడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల వలసలు ప్రారంభమయ్యాయని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

వైసీపీది కోతల ప్రభుత్వం: బీసీ
బీసీ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు

బనగానపల్లె, జూన్‌ 29: సంక్షేమ పథకాల్లో కోతలు విధించడం ధరలు ఆకాశాన్నంటడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల వలసలు ప్రారంభమయ్యాయని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బనగానపల్లెలోని టీడీపీ కార్యాలయం ఆవరణలో బుధవారం తమ్మడపల్లె వైసీపీకి చెందిన బోయ, ఎస్సీలకు చెందిన 50 కుటుంబాలు రామకృష్ణ, ఉగాది, బోయరమణ, గురజాలపుల్లయ్య, గోవింద్‌, ప్రసాద్‌, ఆదిమూలపు సుధాకర్‌, బాలపుల్లయ్య, శివ, బోయమోహన్‌, జంబులతిన్నె తిమ్మయ్య, బోయమద్దిలేటి, చాకలిమూగెన్న, వెంకటేశ్వర్లు పలువురు మహిళా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరగా వీరికి బీసీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తూ సంక్షేమ ఫలాల్లో కూడా వివక్ష చేపుతుండడంతో వలసలు ప్రారంభమయ్యాయన్నారు. సీఎం జగన్‌ అభివృద్ధిని గాలికొదిలేశారని, పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పెన్షన్లలో కూడా నిబంధనల పేరుతో కోత విఽధించడం అన్యాయమన్నారు. నిత్యావసర వస్తువులు, డీజిల్‌, పెట్రోల్‌, విద్యుత్‌, బస్‌ చార్జీలు చార్జీలు విపరీతంగా పెంచారన్నారు. మద్యం ధరలు విపరీతంగా పెంచారన్నారు. పెంచిన ధరల వల్ల సామన్య, మధ్య తరగతి ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోయి అప్పల్లో కూరుకుపోతున్నారన్నారు. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారన్నారు. దీంతో ఏపీ కోలుకోలేని స్థితిలో ఉందన్నారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కొత్త పరిశ్రమలు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్నారు. అనేక మంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుదర్శన్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, ముదిగేడు రాజగోపాల్‌రెడ్డి, మహమ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:06:50+05:30 IST