పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం : ద్వారంపూడి

ABN , First Publish Date - 2022-03-19T17:29:37+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టం చేశారు.

పవన్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తాం : ద్వారంపూడి

కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ద్వారంపూడి.. ఈసారి ఏకంగా శపథం చేశారు. శనివారం నాడు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియా మీట్ నిర్వహించగా.. పవన్ ప్రస్తావన వచ్చింది.


ఎక్కడ పోటీ చేసినా..!

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో తాను ఇంచార్జి పోస్ట్ తీసుకుంటానని కూడా ద్వారంపూడి అన్నారు. అక్కడ (పవన్ ఏ నియెజకవర్గంలో పోటీ చేస్తారో) పార్టీ కోసం పనిచేసి పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని ద్వారంపూడి శపథం చేశారు. పవన్‌కల్యాణ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే హితవు పలికారు. జనసేన కార్యకర్తలకు పవన్‌.. అన్యాయం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే ద్వారంపూడి చేసిన ప్రతి కామెంట్‌కు స్పందించి కౌంటర్ ఎటాక్ చేసిన జనసేన.. తాజా వ్యాఖ్యలపై ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Updated Date - 2022-03-19T17:29:37+05:30 IST