నేను అమాయకుడిని కాదు.. సింహం లాగా బతుకుతా: వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-04-19T15:33:30+05:30 IST

వైసీపీలో అసంతృప్తి గళం కొనసాగుతోంది. రావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

నేను అమాయకుడిని కాదు.. సింహం లాగా బతుకుతా: వైసీపీ ఎమ్మెల్యే

అనకాపల్లి: వైసీపీలో అసంతృప్తి గళం కొనసాగుతోంది. రావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అమాయకుడిని కాదు శాతం హింసా వాదినే.. లక్ష మందితో మీటింగ్ పెట్టి చెప్పమన్నా చెప్తాను.. కావాలంటే జైల్లో పెట్టాలని భయపడేది లేదు.. నేను సింహాన్ని సింహం లాగా బతుకుతా.. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని, కార్యకర్తల్లో ఆవేదన ఉంది’’ అని తెలిపారు. జిల్లాలోని కోటవురట్ల మండల కార్యాలయం, వాలంటీర్ల సన్మాన కార్యక్రమం బయట మీడియా ముఖంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-04-19T15:33:30+05:30 IST