బొబ్బిలి (రామభ ద్రపురం), మే 28: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పక్కి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శనివా రం పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ... తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు ఎన్‌టీ రామారావు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు.