బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో Ananth babu పిటిషన్

ABN , First Publish Date - 2022-07-06T16:54:12+05:30 IST

దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Ananth babu) బెయిల్ కోసం మరోసారి రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

బెయిల్‌ కోసం మరోసారి కోర్టులో Ananth babu పిటిషన్

రాజమండ్రి: దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ(YCP MLC) అనంతబాబు (Ananth babu) బెయిల్ కోసం మరోసారి రాజమండ్రి ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతనెల 17న వైసీపీ ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉదయం  రాజమండ్రి కోర్టులో అనంతబాబు తరుపు న్యాయవాదులు మరోసారి పిటిషన్ వేశారు. బెయిల్ పిటీషన్‌పై విచారణను ఎస్సీ - ఎస్టీ కోర్ట్ న్యాయమూర్తి ఈనెల 11కు వాయిదా వేశారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్యకేసులో అనంతబాబు మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-07-06T16:54:12+05:30 IST