సుబ్రహ్మణ్యానిది హత్యే

Published: Sun, 22 May 2022 11:53:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon

కాకినాడ: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యానిది హత్యగా నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదికతో ఫోరెన్సిక్ నిపుణులు హత్యగా నిర్ధారించారు. కొట్టడంతోనే సుబ్రమణ్యం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సుబ్రమణ్యం శరీరంలో అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ  ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఆయనను పోలీసులు ఎ-1 నిందితుడిగా ప్రకటించారు. అనుమానస్పద మృతి కేసును కాస్తా.. హత్యకేసుగా మార్చారు. దీంతో ఏ క్షణమైనా ఎమ్మెల్సీని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి ముందుగా ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటూ సుబ్రహ్మణ్యం భార్య రెండురోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే.

TAGS: YCP Arrested
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.