హంతకుడతడే..!

Published: Sun, 22 May 2022 02:32:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
హంతకుడతడే..!జీజీహెచ్‌ మార్చురీ గేటు వద్ద బైఠాయించిన దళిత, ప్రజా సంఘాల నాయకులు

 • తన మాజీ కారు డ్రైవర్‌ను హత్య చేసింది వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కరే
 • హత్య ఆయనే చేశాడని పోలీసులకు కుటుంబసభ్యుల లిఖితపూర్వక వాంగ్మూలం
 • దీంతో ఉదయభాస్కర్‌ను అరెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా ఎస్పీ
 • ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వెల్లడి
 • అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చుతున్నట్లు ప్రకటన.. అట్రాసిటీ కేసు కూడా
 • ఇంకా వీడని హత్య మిస్టరీ.. ఎక్కడ? ఎలా చంపారనేదానిపై వీడని చిక్కుముళ్లు
 • శనివారం రోజంతా పోస్టుమార్టంపై హైడ్రామా
 • బయటకు రాకుండా తిరుగుతున్న ఉదయభాస్కర్‌
 • శుక్రవారం రాత్రి పిఠాపురం, తునిలో రెండు వివాహాలకు ఎమ్మెల్యే ధనలక్ష్మితో కలిసి హాజరు 
 • మృతదేహాన్ని తెచ్చిన రోజు మృతుడి బంధువులతో గంటన్నరపాటు బేరాలు
 • ఉదయభాస్కర్‌ను అరెస్ట్‌ చేయాలంటూ రోజంతా దళిత సంఘాలు జీజీహెచ్‌ ముట్టడి
 • రహదారిపై బైఠాయించి నిరసనలు, రాస్తారోకోలు: ఉద్రిక్తలతో అట్టుడికిన కాకినాడ
 • హత్యేనని పేర్కొన్న టీడీపీ నిజనిర్ధారణ బృందం

ఉద్రిక్తత.. ఉత్కంఠ.. మధ్య అసలు విషయం బయటపడింది. హంతకుడు ఎవరనేది నిర్ధారణైంది. ఎమ్మెల్సీ అనంతఉదయభాస్కర్‌ మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతిపై రెండురోజులుగా నెలకొన్న సందిగ్ధత వీడింది. బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నట్టుగా ఈ హత్య చేసింది ఎమ్మెల్సీ అనంతఉదయభాస్కరే అని తేలింది. అనుమానాస్పద కేసును హత్య కేసుగా మారుస్తున్నట్టు స్వయంగా జిల్లా ఎస్పీ ప్రకటించారు. వీలైనంత త్వరగా ఎమ్మెల్సీని అరెస్టు చేస్తామని కూడా తెలిపారు. పోలీసుల ప్రకటన తర్వాత బాధిత కుటుంబీకులు మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు సంతకం పెట్టారు. దీంతో రాత్రి ఒంటి గంటకు ఆ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత మృతదేహానికి కుటుంబీకులకు అప్పగించారు. పెదపూడి మండలం జి.మామిడాడలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా శరీరంపై గాయాలుండడంతో పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కొట్టి చంపినట్టు తేలిందని సమాచారం. 

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

అందరూ అనుమానించిందే నిజమైంది. తన మాజీ కారు డ్రైవర్‌ను వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కరే హత్య చేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు అరెస్ట్‌ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శనివారం రాత్రి పదిగంటలకు వెల్లడించారు. ఎక్కడున్నాడో వెదికి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హత్య వెనుక ఉదయభాస్కర్‌ పాత్ర ఉందని, ఆయనే చంపేశాడని మృతు డి భార్య, తల్లిదండ్రులు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమా నాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చారు. మృతి చెందిన డ్రైవర్‌ దళిత సామాజికవర్గం కావడంతో ఎమ్మెల్సీపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రెండురోజులుగా వాయిదాపడుతున్న పోస్టుమార్టానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. 

అట్టుడికిన జీజీహెచ్‌అట్టుడికిన జీజీహెచ్‌

హత్య తర్వాత డ్రైవర్‌ మృతదేహాన్ని తన కారులో మృతు డి ఇంటికి తెచ్చిన ఉదయభాస్కర్‌ రెండురోజులుగా నోరు మెదపకపోవడంతో అసలు హత్య ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? అనే నిజాలు బయటకు చిక్కక సస్పెన్స్‌గా మారిం ది. రోడ్డుప్రమాదంలో చనిపోయాడని ఎమ్మెల్సీ కట్టుకథ అల్లి నా అసలు రోడ్డుప్రమాదమే జరగలేదని పోలీసులు నిర్ధారిం చడంతో హత్యతో ఉదయభాస్కర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉం దనే కుటుంబీకుల బలమైన వాదన నిజమేనని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ చనిపోతే నిర్భయంగా ఇంటికి వచ్చి అంత్యక్రియలు జరిగేలా కుటుంబానికి సహకరించాలి. కానీ రెండురోజులుగా పరారీలో ఉండడం, హత్యతో తనకు ఏ సంబంధం లేదని ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్నలు వ్యక్త మవుతున్నాయి. హత్య ఉదయభాస్కరే చేయించడంతో పరా రీలో ఉంటూ కేసును తప్పుదోవ పట్టించేందుకు పావులు కదుపుతున్నాడని మృతుడి భార్య, సోదరుడు ఆరోపిస్తున్నా రు. అసలెందుకు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారనేది తమకు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కారణాలు తెలియకుండా శవపంచనామాకు అంగీకరిస్తే తమకు అన్యా యం జరుగుతుందని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతు న్నారు. సజీవంగా ఇంటినుంచి తీసుకువెళ్లి ఆ తర్వాత చని పోయాడని మృతదేహాన్ని అప్పగిస్తే పోస్టుమార్టానికి ఎందు కు అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఉదయభాస్కర్‌ను అరెస్ట్‌ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెబు తున్నారు. కాగా రెండోరోజు శనివారం డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం జరిగే విషయంలో హైడ్రామా నడిచింది. గంట గంటకు పరిణామాలు వేగంగా మారిపోయాయి. అసలు ఏక్షణానికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క దళిత సంఘాలు, టీడీపీ, సీపీఐ, బీజేపీ, జైభీమ్‌ పార్టీలు సైతం జీజీహెచ్‌ మార్చురీవద్ద రోజంతా ఆందోళ నలు చేపట్టాయి. దీంతో జీజీహెచ్‌ అట్టుడికిపోయింది. ఫలి తంగా ఉదయమే మార్చురీవద్ద పోలీసులు ఎన్నడూలేనంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పంచనామా గదికి వెళ్లే దారులను మూసి గేట్లకు తాళాలు వేశారు. కాగా అనంత ఉదయభాస్కర్‌ను అరెస్ట్‌ చేయాలంటూ టీడీపీ నిజనిర్ధారణ బృందం నేతలు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మార్చురీ వరకు ర్యాలీగా నడుచుకుంటూ వచ్చారు. అనంతరం మీడి యాతో మాట్లాడి మృతదేహాన్ని చూసేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరువర్గాలకు తోపు లాట జరగ్గా కొందరు టీడీపీ నేతలపై డీఎస్పీ చేయి చేసు కున్నారు. దీంతో పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్‌ నేత రాజుకు దెబ్బలు తగిలాయి. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు నవీన్‌, మాజీ ఎమ్మె ల్యేలు కొండబాబు, ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తదితర నేతలు ఆస్ప త్రివద్దే ఉండి చికిత్స చేయించారు. అటు జైంభీం వ్యవ స్థాపకుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రవణ్‌కుమార్‌ మృతుడి కుటుంబీకులకు న్యాయం చేయాలని, ఉదయభా స్కర్‌ను అరెస్ట్‌ చేయాలని మార్చురీ ఎదుట బైఠాయించారు.

బెదిరింపులకు భయపడి అజ్ఞాతంలోకి..

మృతుడి కుటుంబీకులు అకస్మాత్తుగా శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి మాయం కావడం సంచలనంగా మారిం ది. ఆరాతీస్తే కొందరు వైసీపీ నేతల ఒత్తిళ్లు, ఉదయభాస్కర్‌ అనుచరులు ఇంటిచుట్టూ అనుమానాస్పదంగా తిరుగు తుండడంతో ప్రాణభయంతో రహస్య ప్రాంతానికి వెళ్లిపోయా రు. తీరా అక్కడికీ వైసీపీ నేతలు వెళ్లి బేరాలు నడిపారు. ఒ త్తిడి తప్పించుకునేందుకు కొమరగిరి వెళ్తే అక్కడ మాటు వేసిన పోలీసులు వీరిని అరెస్ట్‌ చేసి కాకినాడ జీజీహెచ్‌ మా ర్చురీ వద్దకు తరలించారు. గేటు లోపల పోలీసు వాహనాలు అడ్డుపెట్టి బయట ఎవరికీ ఏం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బల వంతంగా పోస్టుమార్టం చేయించడంకోసం లోపలకు తీసు కువెళ్తున్నారని మండిపడుతూ శ్రవణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి రోడ్డుపై బైఠాయించారు. మృతుడి కుటుంబీకులను బెదిరించి కొట్టి సంతకాలు తీసుకుంటున్నా రని ధ్వజమెత్తారు. దీంతో పోలీసులు వీరితో చర్చలు జరిపా రు. అనంతరం శ్రవణ్‌కుమార్‌ను లోపలకు అనుమతించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆయన పోస్టుమార్టంకోసం ఒత్తిడి తెచ్చినా కుటుంబీకులు అం గీకరించలేదని, కేవలం స్టేట్‌మెంట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఉదయభాస్కర్‌ను అరెస్ట్‌ చేసేవరకు పోస్టు మార్టం వద్దని మృతుడి భార్య చెప్పిందని, అంతా అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.

పోస్టుమార్టం కోసం పావులు..

రెండురోజులుగా డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమార్టం జర గకపోవడంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పడింది. పైనుంచి పదేపదే ప్రశ్నలు రావడంతో ఎలాగైనా శనివారం ఈ ప్రక్రి య పూర్తి చేసేందుకు పావులు కదిపారు. అందుకోసం కొమ రగిరినుంచి కుటుంబీకులను అదుపులోకి తీసుకుని తరలిం చడం, సంతకాలకోసం మార్చురీ వద్ద ఒత్తిడి తేవడం వరకు అనేక రకాలుగా వ్యవహరించారు. అయినా కుటుంబీకులు వెనక్కు తగ్గకపోవడంతో జిల్లా కలెక్టర్‌నుంచి ప్రత్యేక అనుమ తుల కోసం పావులు కదిపారు. కలెక్టర్‌ అనుమతిస్తే బంధువుల సంతకాలు లేకుండా శవపం చనామా చేయించడానికి రాత్రి 12 గంటలకు సిద్ధం అయ్యారు. కానీ శనివారం సాయంత్రం కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యా దు ఆధారంగా హత్య కేసుగా మార్చడం తో కుటుంబీకులు శవ పంచనామాకు అంగీకరిస్తారా? లేదా అరెస్టు చూపించే వరకు పోరాడతారా అనేది తేలాల్సి ఉంది. కాగా జరిగింది హత్య.. వీడియో ల్లో ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ స్పష్టంగా ఉన్నారు. కారులో మృతదేహం తెచ్చింది ఆయనే.. కానీ పోలీసులు మాత్రం సర్ప వరం స్టేషన్‌ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంపై ఆరోప ణలు వ్యక్తమయ్యాయి. 302 సెక్షన్‌ కింద హత్య కేసు నమోదు చేయాలని కుటుం బీకులు డిమాండ్‌ చేశారు. కానీ పోస్టుమార్టం పూర్తయ్యే వరకు ఏం చేయలేమని పోలీసులు వాదించారు. దీంతో అనుమానంతో శవపంచనామాకు బంధువులు అంగీకరించ లేదు. కానీ హత్యకు కారకుడు ఉదయభాస్కర్‌ అని శనివారం సాయంత్రం కుటుంబీకులు ఫిర్యాదు ఇవ్వడంతో హత్య కేసు నమోదు చేస్తున్నట్లు రాత్రి 10గంటలకు ఎస్పీ వెల్లడించారు.

ఆ వీడియోల్లో ఏముంది..

హత్య కేసుగా భావించి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీ సులు నాగమల్లితోట జంక్షన్‌, భానుగుడి, కుళాయిచెరువు పార్కు, అమృత ఆస్పత్రి, రాఘవ ఆస్పత్రి, మృతుడి అపార్ట్‌ మెంట్‌, పరిసరాల్లో సీసీ కెమెరాల్లో వీడియోలు శుక్రవారం సేకరించారు. ఉదయభాస్కర్‌ గురువారం రాత్రి ఎక్కడెక్కడ సంచరించాడో రెండు మార్గాలు గుర్తించి ఆ దారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాల దృశ్యాలు రప్పిస్తున్నారు. ఇందులో అ పార్ట్‌మెంట్‌లో గుర్తించిన సీసీ ఫుటేజీలో గంటన్నరపాటు మృతదేహాన్ని కారులోను బయట ఉంచి బంధువులతో వాదు లాడిన వీడియోలు పోలీసులు గుర్తించారు. ఉదయభాస్కర్‌ కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు సేకరించిన పలు వీడియోల్లో ఆయన కదలికలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఉదయభాస్కర్‌ కారు స్టీరింగ్‌, డోరు పై వేలిముద్రలు సేకరించగా అవి ఆయనవేనని కొంత నిర్ధా రణకు వచ్చారు. మృతదేహంపై వేలిముద్రలు ఏమైనా.. ఎవరివైనా పడ్డాయా? అనే కోణంలోను వివరాలు సేకరిస్తు న్నారు. కాగా పగబట్టి పథకం ప్రకారం ఉదయభాస్కర్‌ తమ కొడుకును చంపాడని చెబుతున్న మృతుడి తల్లిదండ్రులు మృతదేహంపై గాయాలున్నాయని చెబుతున్నారు. హత్య జరిగిన రోజు ఉదయభాస్కర్‌ ఎవరెవరితో మాట్లాడాడో పోలీ సులు రహస్యంగా కాల్‌డేటా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఆయనకు అనేక అక్రమ సంబంఽధాలున్నాయని, అవన్నీ తన భర్తకు తెలియడంతో బయటకు రాకుండా చం పేశాడని డ్రైవర్‌ భార్య అపర్ణ ఘంటాపథంగా చెబుతుం డడంతో ఆ సంబంధాలపైనా పోలీసులు దృష్టిసారించారని తెలుస్తోంది. కాకినాడలో ఉదయభాస్కర్‌కు ఉన్న గెస్ట్‌హౌస్‌ కు ఎవరెవరు వస్తారు? వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరోపక్క తాను హత్యకేసులో ఇరుక్కుపోవడంతో వైసీపీలో తనకు కావాల్సిన కొందరు ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన ఓ మంత్రితోను ఉదయభాస్కర్‌ సంభాషించినట్లు సమాచారం. అందులో భాగంగానే ఏం మాట్లాడకుండా ధైర్యంగా పరారీ లో ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం ఆనవాళ్లు నాగ మల్లితోట జంక్షన్‌లో ఎక్కడా లేనందున రోడ్డు ప్రమాదం అంటూ తను చెప్పిన కట్టుకథ అబద్ధమని తేలడంతో నిజా లు అంగీకరించలేక అజ్ఞాతంలో కొనసాగుతూ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నిస్తున్నట్లు బంధువులు చెబుతున్నారు.

దర్జాగా బయట...

డ్రైవర్‌ను తీసుకువెళ్లి ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబీ కులకు అప్పగించిన ఉదయభాస్కర్‌ రెండురోజులుగా హత్య పై మౌనం వీడడం లేదు. ఏం జరిగిందో చెప్పడం లేదు. తన ప్రమేయం లేదని కూడా అనడం లేదు. ఎక్కడా కనబ డకుండా పరారీ లో ఉన్నాడు. కానీ రాత్రయ్యేసరికి విందులు, వినోదా ల్లో మునిగి తేలుతున్నాడు. శుక్రవారం రాత్రి పిఠా పురం, తునిలో వివాహాలకు హాజరయ్యాడు. ఆయన్ను కలిసి న పలువురు పార్టీ ప్రజాప్రతినిధులతో తననెవరూ ఏం పీక లేరని దర్జాగా సమాధానం చెప్పినట్లు పలువురు ఆంధ్ర జ్యోతికి వివరించారు. ఆయన్ను అరెస్ట్‌ చేస్తున్నట్లు ఎస్పీ ప్ర కటించడంతో ఆ సమయానికే సమాచారం తెలిసి తప్పిం చు కుని రహస్య ప్రదేశంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. కానీ పోలీసులు అతడు ఉన్న ప్రదేశం గుర్తించినట్టు సమాచారం. సాధ్యమైనంత వేగంగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

చంపింది బీచ్‌ సమీపంలోనేనా..

స్వయంగా ఇంటికి వెళ్లి డ్రైవర్‌ను తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ ఆ తర్వాత గురువారం అర్ధరాత్రి 12.30గం టలకు మృతదేహాన్ని కారులో ఇంటికి తెచ్చి అప్పగించడం వెనుక అసలేం జరిగింది? అనేది తేలలేదు. బీచ్‌లో ఇసుక లో పడేసి తొక్కి చంపి ఆ తర్వాత రోడ్డుప్రమాదం కట్టు కథ అల్లారని బంధువులు చెబుతున్నారు. ఎక్కడా రక్తం ఆన వా ళ్లు లేకుండా శరీరంపై గాయాలతోపాటు ఒళ్లంతా కంది పో యి ఉంది. దీన్ని బట్టి తీవ్రంగా కొట్టి చంపారని భార్య చెబు తోంది. మరోపక్క రోడ్డు ప్రమాదం కట్టుకథ అల్లిన ఉదయభాస్కర్‌ ఇంటినుంచి పారిపోయి రెండురోజులుగా నోరుమె దపలేదంటే హత్య తనే చేశాడని తల్లిదండ్రులు అంటున్నారు. మృతదేహాన్ని తెచ్చిన కారులో వెనుక సీటులో మట్టి, సముద్రం ఇసుక ఉంది. దీంతో కొమరగిరి ప్రాంతంలోనే చంపి ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలం ఎక్కడనే దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్ట లేదు. నాలుగుచోట్ల సీసీ కెమెరాల ఫుటేజీలు రప్పించారు. వీటిని పరిశీలిస్తున్నారు. అందులో అపార్ట్‌మెంట్‌కు మృత దేహం తెచ్చిన చోట గంటన్నర ఉదయభాస్కర్‌ మృతుడి కుటుంబీకులతో గొడవపడ్డ దృశ్యాలు రికార్డయ్యాయి.

జీజీహెచ్‌ మార్చురీ గేటువద్ద ఉద్రిక్తత

 • రోడ్డుపైనే బైఠాయించిన ప్రజాసంఘాలు
 • పోలీసుల అదుపులో బాధిత కుటుంబీకులు
 • బాధితులకు అండగా నిలిచిన జైభీమ్‌ యాక్సిస్‌ జస్టిస్‌ వ్యవస్థాపక సభ్యుడు జడ శ్రవణ్‌కుమార్‌
 • పోలీసులు, ప్రజాసంఘాల నాయకుల మధ్య తోపులాట

కార్పొరేషన్‌/కాకినాడ క్రైం, మే 21: కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ గేటువద్ద ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతికి కారణ మైన ఎమ్మెల్సీ ఉదయ్‌భాస్కర్‌ను తక్షణం అ రెస్ట్‌ చేయాలని, ఆ తర్వాతే పోస్టుమార్టం నిర్వ హించాలని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యు లు, ప్రజా సంఘాలు, వామపక్ష నాయకులు మార్చురీ గేటువద్ద బైఠాయించారు. ఉదయం నుంచి జీజీహెచ్‌ మార్చురీ గేటు వద్దనే పోరాటం చేస్తున్న జైభీమ్‌ యాక్సిస్‌ జస్టిస్‌ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్‌కుమార్‌తోపాటు ప్రజాసంఘాల నాయకులను, వామ పక్ష నాయకులను మార్చురీ గేటు నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్న పోలీ సులకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. గేటునుంచి బయటకు తోసి న వామపక్షాలకు మద్దతుగా వందలాదిమంది ప్రజలు మార్చురీ గేటువద్దకు వచ్చి న్యాయం చేయాలని ధర్నా చేశారు. దొంగచాటుగా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబ స భ్యులను, తన భార్యను జీజీహెచ్‌ లోపలికి తీసుకెళ్లడంపట్ల ప్రజాసంఘాల నా యకులు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం కుటుంబసభ్యులను జీజీహెచ్‌నుంచి బయటకు పంపించాలన్నారు. జీజీహెచ్‌ మార్చురీ వద్ద ఉన్న వైసీపీ నాయకులను తక్షణం బయటకు పంపించాలని డిమాండ్‌ చేశారు. జీజీహెచ్‌కు వచ్చిన వారిలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మేయర్‌ సుంకర పావని, నాయకులు మోకా ఆనందసాగర్‌, సేరి చిన్న, పేరాబత్తుల రాజశేఖర్‌, దళిత, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు.

మృతదేహం అప్పగింత

సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోస్టుమార్టం తతంగం రోజంతా హైడ్రామాగా సాగింది. ఎట్టకేలకు ఎస్పీ ప్రకటన తర్వాత మృతుడి కుటుంబీకులు పంచనామాకు సహకరించడంతో పోస్టుమార్టం ప్రక్రియ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పూర్తయింది. మృతదేహాన్ని ఫారెన్సిక్‌ విభాగం నుంచి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వగ్రామం పెదపూడి మండలం జి.మామిడాడకు తరలించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.