జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ అర్హతపై 27న కోర్టు నిర్ణయం

ABN , First Publish Date - 2021-04-23T10:21:10+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి గతంలో మంజూరుచేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ అర్హతపై 27న కోర్టు నిర్ణయం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి గతంలో మంజూరుచేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ అర్హమైనదో కాదో ఈ నెల 27న తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీబీఐ కోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మధుసూదన్‌రావు గురువారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి జగన్‌పై 11 సీబీఐ కేసులున్నాయని, వీటన్నిటిలో ఆయనే ప్రధాన నిందితుడని, ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశముందని తెలిపారు.

Updated Date - 2021-04-23T10:21:10+05:30 IST