YCP నేత ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-11-26T12:15:09+05:30 IST

మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కొల్లూరి నరసింహమూర్తి బుధవారం రాత్రి కుటుంబ సభ్యుల తో కలిసి ఇంటి కింది పోర్షన్‌లోని గదులకు

YCP నేత ఇంట్లో చోరీ

తూర్పు గోదావరి: మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కొల్లూరి నరసింహమూర్తి బుధవారం రాత్రి కుటుంబ సభ్యుల తో కలిసి ఇంటి కింది పోర్షన్‌లోని గదులకు తాళాలు వేసి డాబాపై నిర్మించిన మరో భవనంలో నిద్రించారు. గురువారం తెల్లవారుజామున గదుల తాళాలు పగులగొట్టిన దుండగులు లోనికి ప్రవేశించి బీరువాను తెరిచి రూ.23వేల నగదును అపహరించుకుపోయారు. బీరువా లాకర్‌ తెరిచే యత్నం విఫలం కావడం తో వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారు. ఇదే గ్రామంలో ఆర్యవైశ్యుడు కొత్త కామేశ్వరరావు ఇం టి తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. సమీపంలోని మరో ఇంట్లో వారు అనుమానంతో విద్యుత్‌ దీపాలు వెలిగించి కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.  

Updated Date - 2021-11-26T12:15:09+05:30 IST