నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక స్కృటినీలో వైసీపీ దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-11-06T22:45:29+05:30 IST

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక స్కృటినీలో అధికార పార్టీ దౌర్జన్యానికి దిగారు. 10, 14 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులపై ముష్టి ఘాతాలకు పాల్పడ్డారు.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక స్కృటినీలో వైసీపీ దౌర్జన్యం

నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక స్కృటినీలో అధికార పార్టీ దౌర్జన్యానికి దిగారు. 10, 14 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులపై ముష్టి ఘాతాలకు పాల్పడ్డారు. ఆర్వో సమక్షంలోనే టీడీపీ మద్దత్తుదారులపై అధికారపార్టీ నేతలు దాడి చేశారు. వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది.


మరోవైపు ఈ ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తులు కుదరకపోవడంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ, సీపీఎం మధ్య పొత్తుల చర్చలు జరిగినా అవి ఫలిచలేదు. అలాగే బీజేపీ, జనసేనల మధ్య కూడా పొత్తు కుదరలేదు. వైసీపీ, టీడీపీలు అన్ని వార్డులు, డివిజన్లకు నామినేషన్లు వేశాయి. బీజేపీ, జనసేన పార్టీలు మెజారిటీ వార్డులకు నామినేషన్లు వేయగా, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలు బలమున్న వార్డులకు నామినేషన్లు వేశాయి

Updated Date - 2021-11-06T22:45:29+05:30 IST