వైసీపీ నియంతృత్వ పాలన

ABN , First Publish Date - 2021-01-22T05:46:56+05:30 IST

రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్ర జలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

వైసీపీ నియంతృత్వ పాలన
నిరసన ప్రదర్శనలో మాజీ ఎమ్మెల్యే కందుల, టీడీపీ నాయకులు




మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి 

కళా వెంకట్రావు, డాక్టర్‌ ఉగ్ర 

అక్రమ అరెస్టులను ఖండిస్తూ 

టీడీపీ నాయకుల నిరసన

మార్కాపురం, జనవరి 21: రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్ర జలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ ఎ మ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అరె్‌స్టకు నిరసనగా గురువారం స్థానిక దోర్నాల బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నుంచి పురవీధులలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నటరాజ్‌ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అం దజేశారు. ఈ సందర్భంగా  నారాయణరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి విస్మరించిన ఏకైక ముఖ్యమంత్రిగా రాష్ట్ర చరిత్రలో సీఎం జగన్మోహన్‌రెడ్డి పేరుతెచ్చుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ వక్కలగడ్డ మల్లికార్జునరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ, టీడీపీ నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, మర్రి కొండలు, నాలి కొండయ్య, కొప్పుల శ్రీనివాసులు, పోరుమామిళ్ల విజయలక్ష్మి, చిలకపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు.

కనిగిరిలో..

కనిగిరి : రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరె స్టులను చూస్తుంటే వైసీపీ ఆటవిక పాలన తలపి స్తోందని టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. బుధ వారం రాత్రి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, గురువారం తిరుపతిలో డాక్టర్‌ ఉగ్ర హౌస్‌ అరెస్ట్‌ చే యడాన్ని ఖండిస్తూ  పట్టణంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ, చర్చి సెంటర్‌లో మానవ హా రంతో పాటు ఒంటి కాళ్లపై చేతులకు సంకెళ్లతో నిల బడి నిరసన  తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నా య కులు దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, తమ్మినేని శ్రీని వాసులరెడ్డి, చిరంజీవి, బేరి పుల్లారెడ్డి, వెంకటరెడ్డి, రోషన్‌ సందానీ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్‌ చేస్తూ ఆట విక పాలన సాగిస్తున్న సీఎం జగన్‌ వైఖరిని తీవ్రంగా ఖండి స్తున్నామన్నారు. ఎంతో సౌమ్యు డైన కళాపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయ డం అన్యాయమన్నారు. అంతే కాకుండా తిరుపతిలో జరిగే ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక నాయకులతో చర్చిస్తుం డగా చిత్తూరు, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఉగ్ర నరసిం హారెడ్డిని అరెస్ట్‌ చేయడాన్ని తప్పుబట్టారు. జరన్‌రెడ్డి పాల నలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.  కార్యక్ర మం లో మాజీ ఎంపీపీ నం బుల వెంకటే శ్వర్లు యాదవ్‌, పెన్నా చిన నాగయ్య యాదవ్‌, కొం డలు యాదవ్‌, చిన వెంకట రా మి రెడ్డి, జంషీర్‌ అహ్మద్‌, బు జ్జా,  ఎస్టీఆర్‌, గాయం తిరుపతి రెడ్డి, గండికోట రమేష్‌, బ్రహ్మం గౌడ్‌, ఫిరోజ్‌, సలీమ్‌, శ్రీరాము లు, నరసింహ, హజరత్‌, చెన్న య్య, రిజ్వాన్‌, రమణయ్య, జి లానీ, సురేష్‌, రాజా, బారా ఇమాం, వెంగయ్య, గౌస్‌, జనా ర్దన్‌, సురేంద్ర, గురవారెడ్డి, ఆం జనేయులు, వెంకటేశ్వర్లు, సింగ య్య పాల్గొన్నారు. 

పామూరులో..

పామూరు : వైసీపీ అధికా రంలోకి వచ్చిన తరువాత  రాక్షస పాలన సాగుతోందని  టీడీపీ మండల అధ్యక్షుడు పు వ్వాడి వెంకటేశ్వర్లు ఆరోపిం చా రు. స్థానిక శేషమహల్‌ థియేట ర్‌లో మండల టీడీపీ నాయకు లతో గురువారం సమావేశం ని ర్వహించారు.  టీడీపీ నేతల అక్రమ అరెస్ట్‌   దారుణ మన్నారు.  సమావేశంలో మాజీ సర్పంచ్‌ కావేటి సుబ్బ య్య, మాజీ ఉప సర్పంచ్‌ పువ్వాడి చిన లక్ష్మ య్య, గంగరాజు యాదవ్‌, షేక్‌ ఖాజా రహంతుల్లా, ఆర్‌ఆర్‌ రఫి, షేక్‌ రహిమాన్‌, కౌలూరి ఖాజా రహంతుల్లా పాల్గొన్నారు. 

దర్శిలో..

దర్శి : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు అరెస్టును నిరసిస్తూ స్థానిక టీడీపీ నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షు డు పరిటాల సురేష్‌ మాట్లాడు తూ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపుల కు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాచపూడి మోషే, శేషం శ్రీనివాసరావు, సుబ్బారావు, బలరాం పాల్గొన్నారు.




Updated Date - 2021-01-22T05:46:56+05:30 IST