వైసీపీ పాలనలో రైతులు దగా

ABN , First Publish Date - 2022-08-08T06:13:38+05:30 IST

వైసీపీ పాలనలో రైతులు దగా

వైసీపీ పాలనలో రైతులు దగా
వీరవల్లిలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని బచ్చుల అర్జునుడుతో కలిసి ఈలవేసి ప్రారంభిస్తున్న పార్టీ వీరవల్లి అధ్యక్షుడు లంక సురేంద్రమోహన బెనర్జీ

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఆగస్టు 7 :  వైసీపీ పాలనలో సామాన్యులతో పాటు రైతులు అన్ని విధాలా దగాకు గురైవుతున్నారని  ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. టీడీపీ వీరవల్లి  ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బాదుడే బాదుడు, ప్రతి ఇంటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ కూడలిలో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.  గ్రామ కమిటీ అధ్యక్షుడు లంక సురేంద్రమోహన బెనర్జీ ఈలవేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించి శ్రేణు ల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపారు. ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అధిక చార్జీలు, పన్నుల పెంపు, ట్రూఅప్‌ తో కరెంటు బాదుడు గురించి ప్రజలకు వివరిం చారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలన్నా, యువతకు ఉద్యోగాలు కల్పించే మల్లవల్లి లాంటి పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఠంచనుగా అందాలన్నా, పెరిగిన ధరలు తగ్గి పట్టెడ న్నం తినాలన్నా చంద్రబాబు నాయుడు నాయకత్వం లో టీడీపీని అధికారంలోకి  ప్రజలు తీసుకు రావాలని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కోరారు. ఈ కార్యక్రమంలో  పార్టీ మండల అధ్యక్షు డు దయాల రాజేశ్వరరావు, కార్యదర్శి పుట్టా సురేష్‌, జోజి ప్రతాప్‌, మూల్పూరి సాయి కల్యాణి, వేము లపల్లి శ్రీనివాస రావు, గుండపనేని ఉమావరప్రసాద్‌, యనమదల వెంకయ్యారావు, దండు సుబ్రహ్మణ్యం రాజు, మొవ్వా వెంకటేశ్వరరావు, మజ్జిగ నాగరాజు, కంపసాటి కొండలరావు, మందాడి రవీంద్ర, కలపాల సూర్యనా రాయణ, అమృతపల్లి సూర్యనారా యణ, లంక రమేష్‌, సత్యనారాయణరావు, శేషగిరి రావు, అజయ్‌, చెన్నుబోయిన శివయ్య పాల్గొన్నారు. 

ప్రజలకు గుదిబండలా వైసీపీ ప్రభుత్వం

పెనమలూరు : నమ్మశక్యం కాని హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆశలను అడియాశలు చేస్తూ ప్రజలకు గుది బండగా తయారయిందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం తాడిగడప మునిసి పాలిటీ ఒకటవ వార్డు ప్రకృతి విహార్‌ కాలనీలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో  ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారంలోకి రావడమే ధ్యేయంగా అలివిగాని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన అన్ని వాగ్దానాలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  అందరికీ అందు బాటులో ఉచితంగా ఇసుక పొందిన లబ్ధిదారులు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను రద్దు చేసి వారి పొట్టగొట్టారని దుయ్యబట్టారు. ఇసుక, సిమెంటు, స్టీలు ధరలు ఆకాశాన్నంటుతున్నా తమకేమీ పట్టన ట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.  ఈ దోపిడీ ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ప్రజలను కోరారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో పార్టీ  తాడిగడప మునిసి పాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు, ఒకటవ వార్డు ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు, పార్టీ సీనియర్‌ నాయకులు ఆచంట వెంకట చంద్ర, అన్నె రోమన్‌ బాబు, తోటకూర సూర్యనారాయణ, చనుమోలు శ్రీనివాస్‌, కోయ ఆనంద్‌, ప్రవీణ్‌, అజయ్‌, ఈడుపుగంటి లక్ష్మణరావు, ద్రోణవల్లి సత్యనారాయణ, కంచర్ల పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T06:13:38+05:30 IST