సమావేశంలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్
పెనమలూరు, జనవరి 28 : రెండున్నరేళ్ల జగన్ పరిపాలనలో పెరిగిన ధరలతో సామాన్యుడు కుదేల అయ్యాడని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. శుక్రవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెరిగిన నిత్యవసరాల ధరలు, పన్నుల భారం, విద్యుత్ చార్జీలు తదితర కోతలు, వాతలతో సామాన్యులు ఆర్థికంగా కుదేలయ్యారన్నారు. త్వరలో జరగనున్న తాడిగడప మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి పూర్వ వైభవంగా తీసుకువచ్చే విధంగా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలన్నారు. అలాగే ఎన్టీఆర్ పేరిట జిల్లాను ఏర్పాటు చేయడం అభినందనీయమేనని కానీ ఆయన పుట్టిన ప్రాంతానికి ఆయన పేరు పెట్టకపో వడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో నాయ కులు అనుమోలు ప్రభాకరరావు, సూదిమళ్ల రవీంద్ర ప్రసాద్, గురునాధం, వెనిగళ్ల వెంకట కుటుంబరావు, గొంది శివరామకృష్ణ, దేవినేని రాజా, కోయ ఆనంద్, కుర్రా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.