తగ్గిన YSRCP జోరు.. తుస్సుమన్న ఆవిర్భావ దినోత్సవం.. పదవులివ్వరు.. పవర్‌ లేదు!

ABN , First Publish Date - 2022-03-21T17:17:53+05:30 IST

గుంటూరు జిల్లా. కిందటిఎన్నికలలో వైసీపీకి 15 నియోజకవర్గాలను కట్టబెట్టిన జిల్లా. మొత్తం 17 అసెంబ్లీ స్థానాలకూ గానూ 15 చోట్ల వైసీపీనే...

తగ్గిన YSRCP జోరు.. తుస్సుమన్న ఆవిర్భావ దినోత్సవం.. పదవులివ్వరు.. పవర్‌ లేదు!

ఏపీలో వైసీపీపై కేడర్‌ తీవ్ర అసంతృప్తితో ఉందా? పదవులు ఇవ్వరు.. ఇచ్చిన పదవులలో పవర్‌ లేదు... ప్రతిపనిలో తాడేపల్లి ప్యాలెస్‌ జోక్యంతో ఆ పార్టీ నేతలు విసిగిపోతున్నారా? అందుకే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తూతూమంత్రంగా నిర్వహించారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వైసీపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టిన గుంటూరు జిల్లాలో ఆ పార్టీ కేడర్‌ ఏమాత్రం సంతృప్తిగా లేదట. మరి వారి అసంతృప్తి వెనుకున్న కారణాలేమిటో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం... 


తుస్సుమన్న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

గుంటూరు జిల్లా. కిందటిఎన్నికలలో వైసీపీకి 15 నియోజకవర్గాలను కట్టబెట్టిన జిల్లా. మొత్తం 17 అసెంబ్లీ స్థానాలకూ గానూ 15 చోట్ల వైసీపీనే గెలిచింది. తెలుగుదేశం కంచుకోటలలో సైతం వైసీపీని జనం ఆదరించారు. ఈ క్రమంలో గుంటూరువెస్ట్‌లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరి కూడా టీడీపీలో చేరిపోయారు. మరోపక్క మూడు ఎంపీ స్థానాలుంటే రెండింటిని వైసీపీనే గెలుచుకుంది. ఇంతటి ఘనత ఉన్న జిల్లాలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం తుస్సుమంది. అన్ని జిల్లాల్లోనూ ఇలాగే పేలవంగా సాగడంతో కేడర్‌కే పార్టీపై అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం మొదలైంది. 


తొలి రెండేళ్లు ఘనంగా పార్టీ ఆవిర్బావ దినోత్సవం

తొలిరెండేళ్ళలో అట్టహాసంగా  పార్టీ ఆవిర్భావ దినోత్సవంకిందటేడాది కోవిండ్‌ నిబంధనలు గాలికొదిలి మరీ కార్యక్రమాలు అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని  అట్టహాసంగా చేశారు. గత  యేడాది  కోవిడ్ నిబంధనలు గాలికొదిలి ఒకరికొకరు పోటీ పడి మరీ కార్యక్రమాలు చేశారు. తాజాగా సీన్‌ రివర్స్‌ అయింది. ఆనాటి పోటీ మచ్చుకు కూడా కనిపించలేదు. కిందటేడాది రెచ్చిపోయిన కేడర్‌ ఇదేనా అనేంత ఆశ్చర్యం కలిగించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ద్వితీయశ్రేణి నాయకులను ఎవరూ పట్టించుకోవడంలేదు. అసలు ఎమ్మెల్యేలు, మంత్రులకే గతి లేదు. ఇక ద్వితీయశ్రేణి నేతలను ఎవరు పట్టించుకుంటారనే చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ద్వితీయశ్రేణి నాయకులే కీలక పాత్ర పోషిస్తుంటారు. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు వీరికి ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ వైసీపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు అసలు ఏ పనీ ఉండటం లేదు. కేవలం జగన్‌ చుట్టూనే రాజకీయం తిరుగుతుంటుంది. 


పదవిలో ఉన్నా పవర్‌ లేదంటూ ఆవేదన..

దీంతో వీరంతా ఉత్సవ విగ్రహాలుగా మారారు. ఫలితంగా పదవిలో ఉన్నా పవర్‌ లేదంటూ ఆవేదనలో ఉన్నారు. దీంతో వీరు తమనే నమ్ముకున్న ద్వితీయశ్రేణి నాయకులకు ఏం చేయలేకపోతున్నారు. నియోజకవర్గాలలో పనులేమైనా కావాలన్నా, పార్టీపరంగా డబ్బు ఖర్చుచేసి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ప్రధాన నేతలు ద్వితీయశరేణి నాయకులపైనే ఆధారపడుతుంటారు. ఇందుకు ప్రతిగా ఆయా నాయకులకు ఏదో ఒకపని చేసిపెట్టడమో, కాంట్రాక్ట్‌లు ఇప్పించడమో చేస్తారు.  కానీ వైసీపీలో తమకే గతి లేదు ఇక మండల, గ్రామ నేతలను ఎక్కడ పట్టించుకుంటామంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు చేతులెత్తేస్తున్నారు. 


2024 ఎన్నికలే టార్గెట్ గా అధినేత జగన్ రెడ్డి

మితిమీరిన తాడేపల్లి ప్యాలెస్‌ జోక్యం ఈనేపథ్యంలో గుంటూరు జిల్లాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ నాయకుడు ముందుండి గట్టిగా చేయలేకపోయారు.  దీనికి తోడు మితిమీరిన తాడేపల్లి ప్యాలెస్ జోక్యం కూడా పార్టీ నేతల నిస్తేజానికి దారి తీసినట్లు బహిరంగ చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా 2024 ఎన్నికలే టార్గెట్ గా అధినేత జగన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్దీకరణ చేసే ప్రయత్నం లో ఉండగా గుంటూరు జిల్లాలో మాత్రం అధినేత ఉత్సాహనికి భిన్నంగా పార్టీ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తాడేపల్లి పెద్దల ఆలోచనలు మారకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి కూడా కార్యకర్తలు దొరకరని వైసీపీ వర్గాల ఇన్‌సైడ్‌ టాక్‌. 

Updated Date - 2022-03-21T17:17:53+05:30 IST