పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ

ABN , First Publish Date - 2021-06-17T06:19:55+05:30 IST

కొవిడ్‌తో దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న ప్రజలపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పన్నుల భారం పెంచి, నడ్డి విరుస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డా రు.

పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీ
సచివాలయంలో వినతిపత్రం అందజేస్తున్న మహిళా మోర్చా నేతలు


మండిపడ్డ బీజేపీ నేతలు

అనంతపురం అర్బన్‌, జూన్‌ 16 : కొవిడ్‌తో దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్న ప్రజలపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పన్నుల భారం పెంచి, నడ్డి విరుస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డా రు. ఆస్తి పన్ను పెంపు, చెత్తపై పన్ను వసూలు నిర్ణయాలను ప్రభుత్వం ఉపసహరించుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో నగరంలోని కార్పొరేషన్‌, సచివాలయాల వద్ద బుధవారం నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. నగర పాలక సంస్థ కార్యాలయం ముందు రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. వారు మాట్లాడుతూ సీఎం జగన్‌ ఉచిత పథకాల పేరుతో ఒక చేత్తో ఇస్తూ.. మరో చేత్తో ఐదొంతులు దండుకుంటున్నారని మండిపడ్డారు. రెండు సంవత్సరాల్లో ఒక అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టిన పాపాన పోలేదన్నారు. తాము అధికారంలోకి వ స్తే.. అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రజలను మోసం చేసి, సీఎం అయిన జగన్‌మోహన్‌రెడ్డి నేడు రాష్ర్టాన్ని అధోగతి పాల్జేశారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలపై భారం మోపు తూ ఆస్తి పన్ను పెంచడం దారుణమన్నారు. చెత్తపై పన్నువసూలు చేసేందుకు జీఓను విడుదలచేసి, వైసీపీ పిచ్చితుగ్లక్‌లా వ్యవహరిస్తోందన్నారు. వెంట నే ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి, పెద్దఎత్తున ఆందోళనలు చేయాల్సి ఉంటుందని హెచ్చిరించారు. అనంతరం కమిషనర్‌ మూర్తిని కలసి, వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఎం.శ్రీనివాసులు, ఫయాజ్‌, హరికృష్ణ, శ్రీధర్‌, సూర్యప్రకా్‌షరెడ్డి, మంజునాథ, అశోక్‌, రాజేష్‌, మహి ళా మోర్చా నేతలు అనంత కుమారి, రూప, చిన్ని రంగమ్మ, మల్లీశ్వరి పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T06:19:55+05:30 IST