వైసీపీ ప్లీనరీకి ముస్తాబు

ABN , First Publish Date - 2022-07-08T01:49:40+05:30 IST

వైసీపీ (YCP) రాష్ట్ర స్థాయి ప్లీనరీకి వేదిక ముస్తాబైంది. గుంటూరు జిల్లా కాజా సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ప్లీనరీ సభకు సర్వం సిద్ధం చేశారు.

వైసీపీ ప్లీనరీకి ముస్తాబు

గుంటూరు: వైసీపీ (YCP) రాష్ట్ర స్థాయి ప్లీనరీకి వేదిక ముస్తాబైంది. గుంటూరు జిల్లా కాజా సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ప్లీనరీ సభకు సర్వం సిద్ధం చేశారు. రెండు రోజుల పాటు జరిగే సభను సక్సెస్‌ చేయాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలకు అప్పగించారు. ప్లీనరీ ఏర్పాట్లుకు సంబందించి ఇప్పటికే వైసీపీ అధిష్టానం మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ప్లీనరీ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమై శనివారం సాయంత్రానికి ముగియనున్నది. ప్లీనరీకి 6 లక్షల నుంచి 7  లక్షల వరకు జన సమీకరణ చేయాలని అధిష్టానం కేడర్‌కు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు కనీసం 5 లక్షలకు తగ్గకుండా జనసమీకరణ చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, డివిజన్‌ కార్పొరేటర్లు, అధ్యక్షులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు.


ఒక్కో కార్పొరేటర్‌ కనీసం డివిజన్‌ల నుంచి 1000 మందికి తగ్గకుండా జనసమీకరణ చేయాలని గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఇప్పటికే కార్పొరేటర్లు, పార్టీ డివిజన్‌ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ శ్రేణులతో పాటు డ్వాక్రా సంఘాలు, ఆటో యూనియన్లకు కూడా పిలుపునిచ్చారు. అంతేగాక వలంటీర్లు కూడా పెద్ద ఎత్తున తరలిరావాలని గుంటూరులో నేతలు సచివాలయాల్లో సమావేశాలు పెట్టి మరీ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కేవలం సమావేశాలతో ముగించేస్తున్నారని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు తమలో తాము మదన పడుతోన్నారు. ఆర్థిక వనరులు సమకూర్చకుండా జనసమీకరణ ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-07-08T01:49:40+05:30 IST