వైసీపీ ప్లీనరీలో చంద్రబాబు పేరు 100 సార్లు.. వైఎస్‌ఆర్ పేరు 10 సార్లు..

ABN , First Publish Date - 2022-07-10T01:13:23+05:30 IST

అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ (YCP Plenary) నిర్వహించింది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత

వైసీపీ ప్లీనరీలో చంద్రబాబు పేరు 100 సార్లు.. వైఎస్‌ఆర్ పేరు 10 సార్లు..

అమరావతి: అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ ‘ప్లీనరీ’ (YCP Plenary) నిర్వహించింది. ఒకవైపు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి, ఇంకోవైపు టీడీపీ మహానాడు (TDP Mahanadu), మినీ మహానాడు కార్యక్రమాలు విజయవంతమైన నేపథ్యంలో... ఒకవిధమైన ఒత్తిడితో కూడిన వాతావరణంలో వైసీపీ ప్లీనరీ ముగిసింది. ఈ ప్లీనరీలో జగన్‌తోపాటు వైసీపీ నేతలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమావేశాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ప్లీనరీలో సీఎం జగన్ ఆక్రోశంతో ఊగిపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు వైసీపీ నేతలు మీడియా, ప్రతిపక్ష నేతలపై పడ్డారు. ప్లీనరీ ఉద్దేశం, పార్టీ విస్తరణ, ప్లీనరీ తీర్మానాలు ఇవన్నీ పట్టించుకోకుండా చంద్రబాబుపై విషాన్ని కక్కారు. ఒకటి రెండు కాదు ఏకంగా వంద సార్లు చంద్రబాబు పేరును ప్రస్తావించారు.


 దీన్నిబట్టి వైసీపీ నేతలు ఎంత ప్రస్టేషన్‌లో ఉన్నారో అర్థమవుతోంది. రెండు రోజుల వైసీపీ ప్లీనరీలో చంద్రబాబు (Chandrababu) పేరును 100 సార్లు వైసీపీ నేతలు పలికారు. ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుపేరు 80 సార్లు, ABN రాధాకృష్ణ పేరు 70 సార్లు ప్రస్తావించారు. TV5 నాయుడి పేరు 60 సార్లు, దుష్టచతుష్టయం పేరు 50 సార్లును వైపీసీ నేతల నోట వినిపించాయి. దత్తపుత్రుడు పేరు 40 సార్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ABN, TV5 పేర్లు 30 సార్లు ప్రస్తావించారు. టీడీపీ నేత లోకేష్ పేరు 20 సార్లు పలికారు. వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తండ్రి వైఎస్‌ఆర్‌ పేరుని కేవలం 10 సార్లు మాత్రమే నేతలు ప్రస్తావించారు. పార్టీ దిశానిర్దేశం, కార్యచరణపై చర్చించాల్సిన ఈ ప్లీనరీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పేరుని ఏకంగా 100 సార్లు పలకడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పేరుని పలికిన తీరుని బట్టి వైసీపీ నేతల తీరును అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు. 


‘ఆంధ్రజ్యోతి’కి అనుమతి లేదు

వాస్తవాలు రాసే మీడియాపై జగన్‌ సర్కారు వివక్ష కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ‘ఆంధ్రజ్యోతి’పై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ప్లీనరీకి ‘ఆంధ్రజ్యోతి’ని ఆహ్వానించలేదు. తమకు అనుకూలమైన మీడియాకు మాత్రమే ప్రత్యేకంగా పాసులు జారీ చేశారు. వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన మూడో ప్లీనరీ ఇది. తొలుత 2011 జూలై 8, 9 తేదీల్లో ఇడుపులపాయలో  నిర్వహించారు. ఆ తర్వాత ఆరేళ్లకు 2017 జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా కాజ సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్లీనరీ జరిగింది. ఈసారి కూడా ఇదే ప్రాంగణంలో పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి... మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విశాఖలో ప్లీనరీని నిర్వహిస్తారని భావించారు. కానీ... నాగార్జున వర్సిటీకి ఎదురుగా గతంలో నిర్వహించిన ప్లీనరీ తర్వాతే అధికారంలోకి వచ్చామన్న సెంటిమెంట్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2022-07-10T01:13:23+05:30 IST